పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?

Rahul Gandhi said new abrivation for Paytm

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో తీవ్ర చర్చ సాగుతోంది. మోదీ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత జనాలు నగదు చేతిలో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలుపడుతున ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్లమెంట్ లో ప్రతిపక్షపార్టీలు కంకణం కట్టుకున్నాయి. కానీ పార్లమెంట్ లో మాత్రం ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా కానీ మోదీ మాత్రం కిమ్మనడంలేదు. అయితే మోదీ మీద ఎలా కసి తీర్చుకోవాలో తెలియని రాహుల్ గాంధీ మొత్తానికి ఓ ట్రెండింగ్ స్టేట్ మెంట్ చేశారు. పేటిఎంకు మోదీకి లింక్ వేస్తూ రాహుల్ వేసిన జోక్ ఇప్పుడు అందరికి చర్చనీయాంశంగా మారింది.

పేటీఎం అంటే పే టూ మోడీ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. పెద్ద నోట్లు ర‌ద్దును త‌ప్పుబ‌డుతూ మోడీ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు  రాహుల్ గాంధీ. నోట్లు ర‌ద్దై నేటితో ఒక నెల పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నాయి విప‌క్షాలు. పార్ల‌మెంట్ బ‌య‌ట ఉన్న మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన విప‌క్షాలు త‌మ నిర‌స‌న‌ను తెలిపాయి. స‌భ‌లో నోట్ల ర‌ద్దుపై చర్చకు సిద్ద‌మ‌న్న రాహుల్ ..ఓటింగ్ లేకుండా చ‌ర్చ చేప‌ట్టాల‌ని అన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశ‌వ్యాప్తంగా 100 మంది సామాన్యులు మృతిచెందార‌న్నారు. నోట్లు ర‌ద్దు విష‌యం ప్ర‌ధాని స‌న్నిహితుల‌కు ముందే లీక్ అయ్యింద‌ని మండిప‌డ్డారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై చ‌ర్చించేందుకు స‌భ‌కు రాకుండా ప్ర‌ధాని ముఖం చాటేస్తున్నార‌ని విమ‌ర్శించారు రాహుల్‌. స‌భ‌ను న‌డిపించే బాధ్య‌త స్పీక‌ర్‌ది ప్ర‌భుత్వానిదే త‌ప్ప విప‌క్షాల‌ది కాద‌న్నారు. సామాన్య ప్ర‌జ‌లు డ‌బ్బులు లేక క‌న్నీరుపెడుతుంటే మోడీకి న‌వ్వులాట‌గా ఉంద‌న్నారు రాహుల్‌. దేశంలో సామాన్యుడి స‌మ‌స్య‌ల‌ను మోడీ స‌ర్కార్ గాలికొదిలేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. మోడీది సూటు-బూటు ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు రాహుల్‌. మొత్తానికి రాహుల్ చెప్పిన పేటిఎం కొత్త అర్థం మాత్రం భలే ఉంది కదా.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
బెంగళూరుకు భంగపాటే
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
అతి పెద్ద కుంభకోణం ఇదే
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
500 నోటుపై ఫోటో మార్చాలంట
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
కేసీఆర్ మార్క్ ఏంటో?
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments