రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం

Railway Budget Merged With Union Budget

పిండ ప్రదానానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ వేదికగా, మోదీ అధ్యక్షతన, ఆర్థిక మంత్రి కనుసన్నల్లో, దేశం మొత్తం గమనిస్తుండగా పిండ ప్రదానం చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఇంతకీ అందరూ కలిసి దేనికి పిండప్రదానం చెయ్యడానికి సిద్ధమవుతున్నారు అని అనుకుంటున్నారా..? రైల్వే బడ్జెట్ కు. ప్రతి సంవత్సరం రైల్వే మంత్రి ప్రకటించే రైల్వే బడ్జెట్ కు మంగళం పాడేందుకు రంగం సిద్ధమైంది. అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి రైల్వే బడ్జెట్ అనే మాట ఇక కనుమరుగుకానుంది అనేది మాత్రం క్లారిటీ వచ్చింది.

వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ స్వరూపం మారిపోతుంది. ఇక ముందు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టబోరు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను విలీనం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచే ఇది అమలులోకి వస్తుంది. అంటే వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఒకే సాధారణ బడ్జెట్ సమర్పణ, ఒకే అప్రోప్రియేషన్ బిల్లు ఉంటాయి.

సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌ను విలీనం చేసినా, రైల్వే ప్రత్యేక ప్రతిపత్తికి, అస్థిత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం విశేషం. అంతే కాదు రైల్వేపై పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చ ఉంటుంది. రైల్వే ఆదాయ, వ్యయాలు, కొత్త రైళ్లు, ఇతర విస్తరణ అంశాలపై పార్లమెంటులో విస్త­ృతంగా చర్చ జరుగుతుందని చెప్పడం గమనార్హం. ఈ విధంగా బ్రిటీష్ ప్రభుత్వం నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న మరో సంప్రదాయానికి ఎన్డీఏ సర్కార్ స్వస్తి చెప్పింది.

బ్రిటీష్ ఇండియాలో తొలిసారిగా 1924లో భారతీయ రైల్వే ఆర్థిక అంశాలపై ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బ్రిటీష్ ఇండియాలో అప్పటి ప్రభుత్వం 1920-21లో బ్రిటీష్ రైల్వేకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు విలియం అక్‌వర్త్ ఆధ్వర్యంలో పది మంది సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సు మేరకు 1924 నుంచి సాధారణ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలనుంచి రైల్వే ఆర్థిక వ్యవహారాలను వేరు చేసింది. అదే సంప్రదాయాన్ని స్వతంత్ర భారత దేశంలోనూ కొనసాగిస్తూ వచ్చారు. కానీ మోదీ సర్కార్ ఇప్పుడు కొత్తగా రైల్వే బడ్జెట్ ను ఎత్తివేసేందుకు సిద్ధమైంది.

మోదీ సర్కార్ వాదన ప్రకారం.. రైల్వే బడ్జెట్ ను కూడా యునియన్ బడ్జెట్ లోనే చేరుస్తారు. అలాగే కేటాయింపులు కూడా జరుగుతాయి. గతంలోలాగా రైల్వే కేటాయింపుల కోసం ఒత్తిళ్లు ఉండవు.. కేంద్ర మంత్రుల జోక్యం అసలు ఉండదు అనేది వాదన. కానీ ముందు నుండి సాధారణ బడ్జెట్ ను, రైల్వే బడ్జెట్ ను వేరువేరుగా చూసిన జనం రెండింటిని కలిపి ఒకే బడ్జెట్ లో ఎలా ఆకలింపు చేసుకుంటారు అనేది చూడాలి. అలాగే రైల్వేల మీద గతంలో ఉన్న వివరణ ఈ బడ్జెట్ లో మాత్రం కనిపించదు.

Related posts:
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పవన్ చంద్రుడి చక్రమే
పట్టిసీమ వరమా..? వృధానా..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments