టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా

Rajan resigned for TATA

దేశంలో పేరెన్నికగన్న పెద్ద కంపెనీల్లో టాటా కూడా ఒకటి. దేశీయంగా ఎంతో మంచి పేరు, విలువలను కలిగిన కంపెనీగా టాటాకు గుర్తింపు ఉంది. కాగా గత వారం రోజులుగా టాటాలో తీవ్ర కలకలం రేగుతోంది. టాటా గ్రూప్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సైరస్ మిస్త్రీని హటాత్తుగా తొలగించిన తరువాత, మార్కెట్ లో తీవ్రంగా నష్టపోతున్న ఆ సంస్థకి మరొక ఝలక్ తగిలింది. ఈసారి మిస్త్రీకి సన్నిహితుడుగా చెప్పుకోబడే ఎన్.ఎస్.రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన టాటా గ్రూప్ లో మానవవనరుల విభాగానికి (హ్యూమన్ రిసౌర్స్)కి అధిపతిగా పనిచేస్తున్నారు. మిస్త్రీ తొలగింపు తరువాత ఆయన రాజీనామా చేయవచ్చని లేదా టాటా సంస్థే ఆయనని తొలగించే అవకాశం ఉందని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.  వాటిని నిజం చేస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో ఆయన నేతృత్వంలో నడుస్తున్న కార్యనిర్వాహక కౌన్సిల్ కూడా రద్దు అయింది.

దీనిపై టాటా సంస్థ ప్రతినిధి స్పందిస్తూ, టాటా గ్రూప్ లో ప్రతీ సంస్థకి తన అవసరాలకి తగిన వారిని నియమించుకోవడానికి వేర్వేరుగా మానవ వనరుల విభాగాలు ఉన్నాయని కనుక రాజన్ రాజీనామా సంస్థపై ఎటువంటి ప్రభావం చూపదని అన్నారు. త్వరలోనే కొత్త అధిపతిని, కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికి టాటాకు గత వారం రోజుల నుండి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కాగా టాటా కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాలు షేర్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. టాటాలో జరిగే ప్రతి పరిణామం స్టాక్ మార్కెట్ ను కుదేలు చేస్తోంది. మరి చూడాలి ముందు ముందు ఇంకెన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయో.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
కాటేసిందని పాముకు శిక్ష
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
తాగుబోతుల తెలంగాణ!
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఏపీకి ఆ అర్హత లేదా?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
అమ్మ పరిస్థితి ఏంటి?
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments