సల్మాన్ ను వదలని కేసులు

Rajasthan Govt moves to Supreme Court on Salman Khan Case

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన పాత కేసులో చిక్కుల్లోపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.1998లో జోధ్ పూర్ కు సమీపంలోని భావద్ – మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను  వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబందించి ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అంతకముందు ట్రయల్ కోర్టు సల్మాన్ ను ఈ కృష్ణజింకల కేసుకు సంబందించి దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోగా మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు – భావద్ కేసును మాత్రం హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే ఈ విషయంలో సరైన సాక్షాలు లేవని సల్మాన్ ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు తీర్పు అనంతరం రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కండల వీరుడికి కృష్ణజింకల కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి!

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
అతడి అంగమే ప్రాణం కాపాడింది
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
రాజీనామాలు అప్పుడే
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
అమ్మను పంపించేశారా?
రాసలీలల మంత్రి రాజీనామా
పవన్ పంచ ప్రశ్నలు
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
కాంగ్రెస్ నేత దారుణ హత్య
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments