సల్మాన్ ఖాన్ నిర్దోషి

Rajasthan High Court pronounce Salman Khan as Innocent in Deer Case

Rajasthan High Court pronounce Salman Khan as Innocent in Deer Case.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాల ద్వారా ఎంత పాపులరో వివాదాల ద్వారా కూడా అంతే పాపులర్. ఆయనను గత కొన్ని సంవత్సరాల నుండి వేధిస్తున్న కృష్ణ జింకల కేసులో మొత్తానికి సల్మాన్ కు విముక్తి లభించింది. ఇప్పటికే సుల్తాన్ సినిమా హిట్ అయినందుకు ఫుల్ ఖుషీగా ఉన్న సల్లూ భాయ్ ఫ్యాన్స్ తాజా వార్త విని తెగ సంతోషిస్తున్నారు.  ఆయన మీదున్న కృష్ణ జింకల వేటాడిన కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టుకీలక తీర్పును ఇచ్చింది.  ఈ తీర్పు ఆయన్ను మరింత రిలాక్స్ చేస్తుందనటంలో సందేహం లేదు.

1998లో జోథ్ పూర్ లోని రెండు వేర్వేరు ఘటనల్లో ఒక కృష్ణ జింకను.. ఒక మామూలు జింకను వేటాడినట్లుగా బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ తో సహా మరో ఏడుగురిపైన కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు జోథ్ పూర్ కోర్టు ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చారు. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఈ వాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తన తీర్పును వెల్లడించింది. కృష్ణ జింకల కేసులో జోథ్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన రాజస్థాన్ హైకోర్టు.. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా వెలువడిన తీర్పుతో కృష్ణ జింకల కేసు నుండి సల్మాన్ బయటపడ్డారు. మొత్తానికి సల్మాన్ కు సుల్తాన్ హిట్ సంబరాల్లో ఉండగా ఇప్పుడు కోర్టు కేసు నుండి కూడా రిలీఫ్ దొరకడం మరింత సంతోషాన్ని కలిగించింది.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
గుజరాత్ సిఎం రాజీనామా
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
నయీం బాధితుల ‘క్యూ’
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
జగన్ సభలో బాబు సినిమా
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
BSNL లాభం ఎంతో తెలుసా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
అమ్మ పరిస్థితి ఏంటి?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
ఆ క్యాలెండర్‌లో చెప్పిందే జరిగిందా?

Comments

comments