ఇక యుద్ధమే కానీ..

Ready to war but

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఉరీ దాడిలో భారత్ కు చెందిన 19 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. అయితే ఇప్పటికి వాతావరణం వేడెక్కింది.. యావత్ భారతం పాకిస్థాన్ మీద దాడిని కోరుకుంటోంది. సైన్యంలోని చాలా రెజిమెంట్లు కూడా యుద్ధానికి పూనుకోవాలని కాంక్షిస్తున్నాయి. పాకిస్థాన్ కు ఎన్నిసార్లు అవకాశిచ్చినా కానీ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడంలేదని అందుకే తూటాకు తూటానే సమాధానమే అని భారత్ అంటోంది. అయితే ఇక్కడ మోదీ సర్కార్ యుద్ధం చెయ్యాలా వద్దాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది.

అసలు మోదీ పాకిస్థాన్ మీద యుద్ధానికి సిద్దమవుతారా..? పాకిస్థాన్ గురించి ప్రధానిగా మారకముందు చెప్పిన మాటలు నిజం చేస్తాడా..? మన సైనికులను పొట్టనపెట్టుకున్న పాక్ ను వదిలేస్తారా..? హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ అంత సాహసం చేస్తారా..? రక్షణమంత్రి మనోహర్ పారికర్ పాక్ మీద యుద్ధానికి పూనుకుంటారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీరి గురించి తెలుసుకోవడానికి ముందు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో తెలుసుకోవాలి.

దేశంలో చాలా మందికి ఉన్న ఓ నమ్మకం ఏంటంటే.. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ రక్షణపరంగా దేశం పకడ్బందీగా ఉండాలంటే ఎన్డీయే సర్కార్ ఉండాల్సిందే అని వాదన ఉంది. పాకిస్థాన్ కు కాస్త గట్టిగా సమాధానం చెప్పగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వమే అని నమ్మకం. నాడు వాజ్ పేయ్ ప్రభుత్వం దగ్గరి నుండి నేటి మోదీ ప్రభుత్వం వరకు ఉన్న నమ్మకం అదే. మరి మోదీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా..? అంటే చూద్దాం.

నరేంద్ర మోదీ.. కరడుగట్టిన జాతీయవాది. అంతకుమించి రాజకీయనాయకుడు. తన రాజకీయాలతో ఎదుటి పక్షాన్ని చిత్తు చేసే సమర్థుడు. ఇప్పటికే మోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుండి పాక్ ఆగడాలు పెచ్చమీరాయి. అందుకే మోదీ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతున్నారు. పాకిస్థాన్ మీద యుద్దానికి కూడా భారత్ సిద్ధం అనే వార్తలు బయటకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది మోదీ అండ్ కో ఇచ్చిన అనుకూల సూచనలే.

ఉరీ ఘటన జరిగిన తర్వాత పాకిస్థాన్ కు గట్టి సమాధానం ఇవ్వడం అప్పుడే మొదలెట్టేసింది. భారత్ ను కవ్వించాలని చూసిన పాకిస్థానీ ఉగ్రవాదులను హతమార్చడం మొదలైంది. రాజ్ నాధ్ సింగ్ మన సైనికులను ఉత్సాహపరిచిన కొన్ని గంటల్లోనే ఎనిమిది మంది ఉగ్రవాదులను మన సైనికులు చంపేశారు. s

ఇక హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ గురించి వస్తే.. ఆయన ఓ రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. రాజకీయం కన్నా తను నమ్మిన సిద్ధాంతాలకు విలువనిచ్చే వ్యక్తి.అంతకంటే ముందు కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. అంతకన్నా దేశభక్తుడు. భారత సైనికుల మీద దాడికి చాలా వేగంగా స్పందించారు. భారత క్యాంపుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉరీ సెక్టార్‌లోని లచిపొరా, ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ దళాలను సమర్థంగా తిప్పికొడుతున్న భారత్ బలగాలకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరింత స్థయిర్యాన్ని ఇచ్చారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్ దళాలపై విరుచుకుపడాలని ఆదేశించారు.

రక్షణమంత్రి మనోహర్ పారికర్ విషయానికి వస్తే.. మోదీ కేబినెట్ లో మోదీ కన్నా నిజాయితీ, దేశభక్తి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మనోహర్ పారికర్. గతంలో పటాన్ కోట్ దాడి సమయంలోనే మనోహర్ పారికర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులు గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని వ్యాఖ్యానించారు. ఉరీ ఘటనతో పారికర్ వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఎంతో ముందుచూపున్న పారికర్ వేగంగా తీసుకున్నా కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం చెయ్యాల్సి వస్తే.. ఏం చెయ్యాలో.. పాకిస్థాన్ ను ఎప్పుడు, ఎక్కడ దెబ్బతియ్యాలో బాగా తెలుసు.

భారత్ శాంతి కోరుకునేచ దేశం అని ప్రపంచానికి తెలుసు. కానీ అదే భారత్ తన ఉగ్రరూపం దాల్చింది అంటే మాత్రం ఆ ఆగ్రహ జ్వాలలకు పాక్ బొగ్గు కావలసిందే. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ను ఏకాకిగా నిలబెట్టేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలాగని యుద్ధం చెయ్యకుండా చేతులు ముడుచుకు కూర్చుంటుంది అని కాదు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే భయంతో కాదు.. వేసే వేటు బలంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే. ఇప్పుడు భారత్ కూడా అలాంటి టైం కోసమే ఎదురు చూస్తోంది. పాకిస్థాన్ కవ్విస్తే యుద్ధానికి దిగేంత అవివేకి కాదు భారత్. ఆచితూచి అడుగులు వేస్తోంది. భారత్ లోని ప్రతి పౌరుడి రక్షణ భారత్ ముందున్న అతిపెద్ద సవాల్.

ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబడేందుకు వీలు కలిగేలా పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. వేగంగా స్పందించిన భారత దళాలు పాక్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆర్మీ డీజీకి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన ఆర్మీ పాక్ దళాలపై విరుచుకుపడింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలన్న వ్యూహాన్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఆర్మీ కాల్పుల్లో కనీసం 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరింతమంది మరణించి ఉండవచ్చిన ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
పిట్టల దొరను మించిన మాటల దొర
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Comments

comments