యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే

Reason Behind June 21 for Internatinal Yoga Day

భారత మణి కిరీటంలో మరో మెరుపు రాయి చేరింది. గత సంవత్సరం నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ దేశాలు కూడా ఆరోగ్యాన్నిచ్చే యోగాకు ఓ ప్రత్యేక గుర్తింపునిస్తూ ఐక్యరాజ్యసమితి తీసుకున్నే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాసటగా నిలిచాయి. గత సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా యోగా దినోత్సవం జరుపుకున్నాం. ఈ సంవత్సరం అంతకన్నా ఘనంగా యోగా దినోత్సవాన్ని భారత్ తో పాటు యావత్ ప్రపంచం నిర్వహించుకుంది.

యోగా దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో వేడుకలు నిర్వహించారు. అమెరికాలో గత ఆదివారం నుండి యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అమెరికా ఒక్కటే కాదు ప్రపంచంలోని దాదాపు 191 దేశాలు యోగా డేను నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రెండు మూడు దేశాలు మినహా అన్ని దేశాలు కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈసారి భారత్ లో గ్రామాల్లో యోగా మీద ఎక్కువ అవగాహన కలిగేలా దాదాపు లక్ష గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల రాజధానులతో పాటుగా పది మేజర్ సిటీల్లో ప్రత్యేక యోగా డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.

యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఛండీఘర్ లో యోగా చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దిల్లీలో యోగా చెయ్యగా, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా యోగాలో పాలుపంచుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి యోగా చేశారు. కాగా ఛండీఘర్ లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. యోగా ప్రతి మనిషికి అవసరమైందని అన్నారు. మధుమేహాన్ని తగ్గించడం ఈ సంవత్సరం మేం పెట్టుకున్న లక్షం అని వివరించారు. యోగాతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భీమా పొందినట్లు చెప్పారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా యోగా చెయ్యాలని హితవు పలికారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి ముందు ప్రతిపాదన ఉంచినప్పుడు అందుకు ఓకే చేసిందని అన్నారు. కాగా జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని ఆయన తెలిపారు. ఏడాదిలో రోజు సమయం ఎక్కువ ఉండేది(Longest Day in Year) జూన్ 21నాడే అని అందుకే ఆ రోజును మరింత స్పెషల్ చేస్తూ యోగా దినోత్సవాన్ని ఆ రోజు నిర్వహించడానికి ఐక్య రాజ్యసమితి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిపారు. యోగా అనేది ధార్మిక కార్యక్రమం కాదని.. చనిపోయిన తర్వాత మోక్షం కోసం చెయ్యడం లాంటిది కాదని.. బ్రతికుండగానే శాంతితో, సుఖంగా ఎలా బ్రతకాలో యోగా చూపిస్తుందని అన్నారు.

  -Abhinavachary

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
సన్మానం చేయించుకున్న వెంకయ్య
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
చంద్రబాబు చిన్న చూపు
నారా వారి నరకాసుర పాలన
జియోకు పోటీగా ఆర్‌కాం
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
అతి పెద్ద కుంభకోణం ఇదే
పవన్ పంచ ప్రశ్నలు
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Comments

comments