ఊరట పవన్ ఫ్యాన్స్ కు

Pawan-fans11

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ అందరికి పరిచయస్తుడే. మొన్నటి దాకా సినిమాలతో బాగా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయ నాయకుడిగా కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. 2014లో జనసేన స్థాపించిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ మీద దృష్టిసారించారు. పవన్ కళ్యాణ్ తిరుపతి సభ రాజకీయ వర్గాల్లో వేడిని, పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. కానీ సభ ముగిసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ మాట్లాడిన ప్రతి మాటపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శించడం, తెలుగుదేశం, వైసీపీతో సహా అన్ని పార్టీల నాయకులు పవన్ మీద విరుచుకుపడటం వారికి షాకిచ్చింది. కానీ అనుకోని విధంగా పవన్ ఫ్యాన్స్ కు ఊరట లభించింది.

తిరుపతి సభలో పవన్ మాటలకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నా పొలిటికల్ గా మాత్రం చాలా విమర్శలు వచ్చాయి. పవన్ ఏడాదికి ఒకసారి వచ్చే సీజనల్ పొలిటికల్ లీడర్ అని, అన్నాదమ్ములు కలిసి మరోసారి ప్రజలను మోసం చెయ్యడానికి వచ్చారని, తెలుగుదేశం పార్టీ తొత్తు అని ఇలా రకారకాలుగా నెటిజన్లు పవన్ మీద విరుచుకుపడ్డారు. ఇక ఏపి మంత్రులు , కొంత మంది ఎమ్మెల్యేలు పవన్ ను డైరెక్ట్ గా ఏకిపారేశారు. పవన్ మీద వస్తున్న విమర్శలకు మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ సమాధానమివ్వలేకపోయారు. కానీ వారికి ఊరటనిచ్చేలా మోదీ అడుగులు వేస్తున్న వార్త ఎంతో సంతోషానిస్తోంది.

అదేంటి ఇప్పటి దాకా నిరుత్సాహంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్ అని అన్నారు అంతలోనే ఎలా ఊరట లభించింది అని అనుకోకండి.. కేంద్రంలో జరుగుతున్నపరిణామాలు పవన్ కు అనుకూలంగా జరుగుతున్నట్లు సమాచారం. తిరుపతి వేదికగా నాడు మోదీ ప్రత్యేక హోదాపై మాటివ్వడం ఇప్పుడు అదే తిరుపతి వేదికగా పవన్ ప్రశ్నించడంతో బిజెపి వర్గాల్లో కూడా కదలిక మొదలైందని సమాచారం. గతంలో కూడా ప్రత్యేక హోదా గురించి ఒకటి రెండు సార్లు చర్చకు వచ్చినా కానీ దిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం చలనం మొదలైందని తెలుస్తోంది.

ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ మీద రేపు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఏపికి ఏదో తీపి కబురు అందిస్తారు అని వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా లాంటి నాయకులు కూడా పవన్ హవాను ఏపిలో గుర్తించారని, భవిష్యత్తులో తెలుగుదేశం నావ మునిగిపోతే పవన్ పుట్టి(చిన్న పడవ) ఎలాగైనా పనికి వస్తుంది అని అనుకుంటున్నారట. అయితే మామూలు టైంలో కన్నా పవన్ బర్త్ డే నాడు ఏదో ప్రకటన చేస్తే ఖచ్చితంగా బిజెపిపై, మోదీపై పవన్ కాస్త పాజిటివ్ గా ఉంటారని అమిత్ షా అభిప్రాయపడ్డారట. అమిత్ షాకు వెంకయ్య నాయుడు కూడా బాసటగా నిలిచారట. మొత్తంగా ఏపిలో రాజకీయంగా పవన్ ఫ్యాన్స్ కు మాత్రం మోదీ ఊరటనిచ్చే పనిలో ఉన్నారు.

Related posts:
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
బాబు Khan
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
జయను ఎందుకు ఖననం చేశారంటే?
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments