దేశభక్తి మీద సైనికుడి సమాధానం

Retied Soldier strong reply on Patriotism

దేశం మొత్తం దేశభక్తి సీజన్ నడుస్తోంది. మోదీకి వ్యతిరేకంగా లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను దేశభక్తిలేని వ్యక్తిగా లేదంటే దేశద్రోహిగా చిత్రీకరణ సాగుతోంది. తాజాగా మోదీ తీసుకున్న పెద్దనోట్ల బ్యాన్ వల్ల దేశంలో చాలా మంది రకరకాలుగా ఇబ్బందిపడుతున్నారు. అయితే విపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. కానీ దేశభక్తిలేని వాళ్లే మోదీ మీద విమర్శలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో మోదీ భజన బృందం తెగ హడావిడి చేసేస్తోంది. అయితే తాజాగా ఓ మాజీ సైనికుడు చేసిన కామెంట్ చూస్తే మాత్రం పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

దర్శన్ ధిల్లూన్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైడ్ అయ్యాడు. తన  పెన్షన్ డబ్బు తీసుకోవడం కోసం ఏటీఎంకెళ్లాడు. కొన్ని గంటలు ఏటీఎం ముందు క్యు లైన్ లో నిల్చున్న ఆయనకు విసుగొచ్చింది.  దీన్ని గమనించిన దర్శన్ దిల్లూన్ వెనకున్న వ్యక్తి దేశభక్తి మాటలు చెప్పడం ఆయనకు షాకిచ్చింది. దేశంలో డీమానిటైజేషన్ ను అమలు చెయ్యడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని దర్శన్ దిల్లూన్ అన్నారు. దాంతో వెంటనే అందుకున్న అవతలి వ్యక్తి.. దేశ సైనికులు 20 గంటలకు పైగా సరిహద్దు దగ్గర నిల్చుంటున్నారని, ఎందుకంత అసహనమని దర్శన్‌పై మండిపడ్డాడు. అతని మాటలు విన్న ఈ రిటైర్డ్ సైనికుడు ఆశ్చర్యపోయాడు.

ఏటీఎం లైన్ లో తనతో మాట్లాడిన ఆ వ్యక్తికి దర్శన్ సమాధానమిచ్చాడు. తాను కూడా సరిహద్దులో 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసిన సైనికుడినేనని, రిటైరైన తర్వాత తనకొచ్చే పెన్షన్ కోసమే ఈ క్యూలో నిల్చున్నానని చెప్పడంతో ఆ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేశ భక్తి గురించి ఒకరు చెబితే వినే స్థితిలో లేనని అనడంతో ఆ సదరు వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రజలు దేశభక్తితోనే ఉన్నారని, దేశం కోసం పాటు పడిన మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసి మోదీ తన దేశభక్తిని నిరూపించుకోవాలని దర్శన్ సమాధానమిచ్చాడు. మరి దీనిపై మోదీ భజన మండలి ఏమంటారో? ఓ మాజీ సైనికుడికే దేశభక్తి పాటలు చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించే అంశమే.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
సల్మాన్ ఖాన్ నిర్దోషి
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
తెలంగాణకు ప్రత్యేక అండ
రాజీనామాలు అప్పుడే
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
జియోకే షాకిచ్చే ఆఫర్లు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
సదావర్తి సత్రం షాకిచ్చింది
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
నారా వారి నరకాసుర పాలన
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
మోదీ ప్రాణానికి ముప్పు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Comments

comments