గజిని మహ్మద్ గా మారిన రేవంత్

Revanth Reddy became Gajini Mohamad

అదేంటి గజిని మహ్మద్ చనిపోయాడని చిన్నప్పుడెప్పుడో చదువుకున్నాం కదా అనే అనుమానం వస్తోంది. అలాంటి అనుమానం ఏమీలేదు ఖచ్చితంగా మీరు అనుకున్న గజిని మహ్మద్ చనిపోయాడు. కానీ తాజాగా తెలంగాణలో గజిని మహ్మద్ కు జూనియర్ గా మారిన రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. గజిని మహ్మద్ భారత్ మీద విజయం సాధించడానికి లెక్కలేనన్నిసార్లు దండయాత్రలు చేస్తే… ఇప్పుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ సర్కార్ మీద అలాంటి దండయాత్రలే చేస్తున్నారు. ఇప్పటి దాకా నోటికి బాగా పని చెప్పిన రేవంత్ తాజాగా కలానికి కూడా పని చెప్పారు.

టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులన్నిటినీ ఒకే విడతగా బ్యాంకు అకౌంట్లలో వేయించాలని రేవంత్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6లక్షల పరిహారం, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల వంతున పరిహారం చెల్లించాలంటూ ఇంకా రైతు సంబంధిత డిమాండ్లు అనేకం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి టిడిపి తరఫున రేవంత్ మాత్రం దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం రేవంత్ చేస్తున్నది దండయాత్ర అని కాదు.. దండగయాత్ర అని కామెడీ చేస్తున్నారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడనే చులకనగా చూడరా ఏంటి?!

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
అతడి అంగమే ప్రాణం కాపాడింది
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
ముద్రగడ సవాల్
అమ్మకు ఏమైంది?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బిచ్చగాళ్లు కావలెను
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
మోదీ చేసిందంతా తూచ్..
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Comments

comments