ఆప్ కాదు పాప్ వర్మ… ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది

RGV Tweeted Not AAP that is a PAP

భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ను దేశం అంతటా సమర్థిస్తుంటే పొలిటికల్ లీడర్లు మాత్రం దాని మీద అసహనం, అనుమానాలు వెల్లగక్కుతున్నారు. అలా భారత ఆర్మీపై లేనిపోని అనుమానాలకు తావు తీసే వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు మన కాంట్రవర్సియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం జరిపిన రక్షిత దాడులకు ఆధారాలు చూపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండుపై ఎవరు ఎలా స్పందించినా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం.. కేజ్రీవాల్ పై విరుచుకపడ్డాడు. మఫ్లర్ క్యాప్ పెట్టుకున్న కేజ్రీవాల్ మన సైన్యంపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏమిటని తన ట్విటర్ లో ప్రశ్నించాడు.

కేజ్రీవాల్ ను మంకీ గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. సైన్యం ఎక్స్ టర్నల్ సర్జికల్ దాడులు చేసింది కానీ.. ఇలాంటి వాళ్ళ తీరు మార్చేందుకు ఇంటర్నల్ దాడులు చేయాలని కోరాడు. కేజ్రీవాల్ ధరించే మఫ్లర్ క్యాప్ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాడ్ని.. ఇప్పుడు సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే మంకీ అనిపించుకున్నాడు.. ఆప్ పార్టీని పాపం పార్టీగా మార్చాలి అని వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి మన ఆర్మీ సాహసోపేతంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ మీద కౌంటర్ వేసిన  దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దిమ్మతిరిగేలా ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.

Related posts:
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
తాగుబోతుల తెలంగాణ!
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
ఓడినా విజేతనే.. భారత సింధూరం
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
సల్మాన్ ను వదలని కేసులు
2018లో తెలుగుదేశం ఖాళీ!
జగన్ సభలో బాబు సినిమా
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
నారా వారి నరకాసుర పాలన
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బిచ్చగాళ్లు కావలెను
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
బంగారం బట్టబయలు చేస్తారా?
ఛాయ్‌వాలా@400కోట్లు
గుదిబండగా మారిన కోదండరాం
మంత్రి గంటా ఆస్తుల జప్తు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments