పది వేలలోపే ఎల్ఈడీ టీవీ

Ringing Bells company to launch ‘cheapest’ HD LED TV

ఏం కొనేటట్లులేదు అనుకుంటున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల సామ్రాజ్యంలో మరో కొత్త విప్లవం రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడా లేని విధంగా 251 రూపాయలకే మొబైల్ ను అందిస్తామని ముందుకు వచ్చిన రింగింగ్ బెల్స్ సంస్థ గుర్తుందిగా.. అదే సంస్థ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జస్ట్ 251రూ.కే స్మార్ట్ ఫోన్ అనడంతో లక్షల్లో ఆర్డర్లు రావడం, ఆ తర్వాత అదంతా ఫేక్ అని ఆరోపణలు వెల్లువెత్తడం, కేసులు నమోదు కావడం అన్నీ జరిగిపోయాయి. ఆ గొడవ మర్చిపోకముందే.. అదే కంపెనీ మరో సంచలన ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ సారి తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీలు విడుదల చేస్తామంటోంది. 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని కేవలం 10వేల కంటే తక్కువకు విడుదల చేస్తామని ఫ్రీడమ్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్ ప్రకటించారు.

ఫ్రీడమ్ 251 ఫోన్స్ డెలివరీ పై మోహిత్ గోయల్ స్పందించారు. తమ వద్ద 2 లక్షల ఫ్రీడం 251 ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని.. రిజిస్టర్ చేసుకున్న వారికి జూన్ 30 నుంచి ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తామని తెలిపారు. మొదటి దశలో 2 లక్షల ఫోన్ల డెలివరీలు అయిపోయాక.. మళ్లీ ఫ్రీడం 251 రిజిస్ట్రేషన్లు మొదలుపెడతామన్నారు. ఒక్కో ఫోన్ పై తమకు సుమారు 150రూపాయల నష్టం వస్తుందని.. అయినా ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోతే లాభం వస్తుందని వివరించారు. త్వరలోనే ఎల్ ఈడీ టీవీని కూడా విడుదల చేస్తామని గోయల్ వెల్లడించారు. కాగా స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి జనాలకు హ్యాండ్ ఇచ్చిన నోయిడాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘రింగింగ్ బెల్స్’.. ఈసారి టీవీల పేరుతో ఎంతమంది ముంచుతుందోనని ప్రజలు వర్రీ అవుతున్నారు.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
తెలంగాణకు ప్రత్యేక అండ
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
రాజీనామాలు అప్పుడే
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
మోదీ చేసిందంతా తూచ్..
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
అవినీతి ఆరోపణల్లో రిజిజు
మంత్రి గంటా ఆస్తుల జప్తు
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments