we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు

Shekar-Basha21

రేడీయో జాకీగా, వీడియో జాకీగా మంచి పేరున్న శేఖర్ బాషా గురించి మనలో చాలా మందికి తెలిసు. అయితే అతడు తాజాగా  ఆంధ్రాజ్యోతి పేపర్ బండారాన్ని, అతిని బయటపెట్టాడు. మోదీ సభకు వచ్చిన జనాలు అంటూ ఆంధ్రాజ్యోతి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తే దాన్ని శేఖర్ బాషా  పట్టించుకొని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. మీడియా ఛానల్స్ ఏం చేసినా చెల్లుతుంది అనే రోజులుపోయాయి.. సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుదొరికిన వెంటనే ఉతికి ఆరేస్తున్నారు.

andhrajyothy

మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుండి మెదక్ కు వచ్చారు. అక్కడ మిషన్ భగీరథ పైలాన్ ను ఓపెన్ చేసి.. బహిరంగ సభలో మాట్లాడారు. అయితే దీన్ని కవర్ చేసిన ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో మోదీ, కేసీఆర్ లతో పాటు సభకు హాజరైన జనాలు అన్నట్లు ఓ ఫోటో పబ్లిష్ చేసింది. అయితే అలా పబ్లిష్ చేసిన ఫోటో ఎంత మాయగా ఉందో శేఖర్ బాషా వివరించాడు. ఒకే ఫోటోను ఫోటోషాప్ లో తిప్పి తిప్పి.. చాలా మంది సభకు హాజరైనట్లు చూపించే ప్రయత్నం చేశారు.

duplicate

ఆంధ్రజ్యోతిలాంటి పాపులర్ న్యూస్ పేపర్ ఇలా ప్రజలను భ్రమలో ఉంచాలనుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. దీనిపై శేఖర్ బాషాతో తెలుగోడ ముచ్చటించింది. ఎంత మంది ప్రజలు సభకు హాజరైతే అంత మంది ఫోటోలను ఒరిజినల్ గా పబ్లిష్ చేస్తే సరిపోతుంది.. అంతే తప్ప ఇలా ప్రజలను ఫూల్స్ చెయ్యాలనుకోవడం తప్పే కదా..? అని అన్నారు. తాను ప్రస్తుతం ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద స్వాతంత్ర్య దినోత్సవానికి సంబందించిన ఓ కార్యక్రమం కోసం భారత సైనికులతొ మాట్లాడేందుకు వెళ్లినట్లు తెలిపారు.

తాను పెట్టిన వీడియోకు రెండు రోజుల్లో దాదాపుగా రెండు లక్షల పైచిలుకు మంది చూడటం.. దాని మీద ప్రజలు అనూహ్యంగా  స్పందించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శేఖర్ బాషా వివరించారు. దీన్ని బట్టి ప్రజలు మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఎలా గమనిస్తున్నారో తెలుస్తోందని ఆయన అన్నారు. చిన్న తప్పు జరిగినా సోషల్ మీడియాలో ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేది శేఖర్ బాషా పెట్టిన ఈ వీడియో నిరూపించింది.

వాస్తవాలను వెల్లడించాల్సిన మీడియా ఇలా ఎందుకు చేస్తోంది..? ఇలా లేని దానిని చూపించాలని ఎందుకు అనుకుంటున్నారు..? దాని వల్ల కలిగే లాభాలేంటి..? అని శేఖర్ బాషా ప్రశ్నించారు. తెలుగులో టాప్ న్యూస్ పేపర్లలో ఒకటైన ఆంధ్రజ్యోతిలాంటి పేపర్ లో కూడా… అది కూడా ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటంలో ఇలాంటి తప్పులు రావడం అనుకోకుండా జరిగిందా..? లేదంటే కావాలని చేసిందా.? అయినా మీడియా అంటే నిప్పులా ఉండాలి కానీ ఇలా డప్పులా ఉండకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
పట్టిసీమ వరమా..? వృధానా..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
మీకో దండం.. ఏం జరుగుతోంది?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు

Comments

comments