రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?

Roja-for-Ministry

నగరి ఎమ్మెల్యేగా కన్నా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా, అధికారపక్షం మీద నిత్యం ఒంటి కాలు మీద లేచే నాయకురాలుగా రోజాకు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. ఈ తరుణంలో ఆమె లోటస్ పాండ్ లో చేసిన వ్యాఖ్యలు ఆమె తన సొంత లక్ష్యం కోసం అవలంభిస్తున్న విధానం సరికాదన్నట్లుగా అనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాస్త సైలెంట్ గా ఉన్న రోజా.. వైసీపీలోకి చేరిన తర్వాత సౌండ్ పెంచారు.

వైసీపీ నుండి ఎమ్మెల్యేగా నగరి నుండి ఎన్నికైన తర్వాత రోజా మాటల్లో మసాలా బాగా పెరిగింది. ఏపి సిఎం చంద్రబాబు నాయుడును దుమ్మెత్తిపోయడం.. ఆయన కొడుకు నారా లోకేష్ ను పప్పు అంటూ సంబోధించడం.. మంత్రులను దద్దమ్మలు అని అనడం ఇలా రకరకాలుగా ఆమె తన మాటల తూటాలతో అధికారపక్షంలో కలకలం రేపింది. అసెంబ్లీ ఎపిసోడ్ అయితే ఆమెకు భారీ పబ్లిసిటిని కల్పించింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి ఆమె మాటలను గమనించిన వైసీపీ నాయకులు రోజా ఇంతలా రెచ్చిపోవడానికి అదే కారణం  అంటూ గుసగుసలాడుతున్నారు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోవడం ఖాయమని.. జగన్ సిఎం అవుతారు అని రోజా గట్టి నమ్మకంగా ఉందని అనిపిస్తోంది. ఈ తరుణంలో రోజా వైసీపీలో ఎంతో కీలకంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని ఆమె టార్గెట్ గా చేస్తుండటం చూస్తున్న  వాళ్లు విస్తుపోతున్నారు. రోజా మంత్రి పదవి కోసమే ఇంతలా తాపత్రయపడుతోందని లోటస్ పాండ్ నుండి కొన్ని సంకేతాలు అందుతున్నాయి.

రోజా అంటేనే ముందు నుండి వివాదాలకు కేరాఫ్ గా నిలిచారు. జగన్ కన్నా ముందుగానే చంద్రబాబు నాయుడును, ప్రభుత్వాన్ని ఆమె అత్యుత్సాహంతో ఉతికిఆరేయడం అనేది.. రాబోయే రోజుల్లో  మంత్రి పదవిని ఆశించి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పాటిస్తున్న విధానంపై కొంత మంది పెదవి విరుస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా తన పార్టీ అధికారంలోకి రావాలని ఉంటుంది. కానీ పదవుల కోసమే పార్టీలో పనిచెయ్యడం కన్నా ప్రజా సేవ చెయ్యడం ద్వారా మరియు ప్రజల కోసం పోరాటం చెయ్యడం ద్వారా ఎప్పటికైనా, ఎన్ని పదవులైనా, ఎన్ని సార్లైనా వస్తాయని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. మరి అలాంటప్పుడు రోజా తన విధానాన్ని పదవి మీద కన్నా ప్రజా పోరాటాలపైన ఆసక్తిని కనబరుస్తారేమో రాబోయే రోజుల్లో చూడాలి.

Related posts:
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
స్టే వస్తే కురుక్షేత్రమే
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments