జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు

Roja

ఏపిలో రాజకీయ వేడి కాకపుట్టిస్తోంది. వైయస్ జగన్ అక్కడి ప్రభుత్వానికి చెమటలుపట్టిస్తూ.. అధికారపక్షానికి నిద్రలేకుండా చేస్తున్నారు. రోజా మాటలు తూటాల్లా పేలుతాయి. ఆమె చంద్రబాబును, లోకేష్ ను లేదంటే మంత్రులను టార్గెట్ గా చేస్తే మీడియా ఖచ్చితంగా ఆమె మాటలపై నానా రకాలుగా మాట్లాడుకుంటుంది. నగరి ఎమ్మెల్యేగా తన మార్క్ వేసిన రోజా.. ఏపి రాజకీయాల్లో కొత్త గుర్తింపు తీసుకువచ్చారు. అయితే తాజాగా ఆమె తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత ఇప్పుడు చాలా కాలానికి తిరిగి అదే పార్టీలో చేరుతుంది అని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీని పై ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంలో చేరేది లేదని అన్నారు. తాను జగన్ బాణాన్ని అని రోజా స్పష్టం చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ది చేసింది అని ఆ పార్టీలో చేరాలని ఎదురు ప్రశ్నించారు. అయినా ఇది వందకు వంద శాతం పుకారు అని తన మాటల ద్వారా ఆమె స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రోజాలు ఇద్దరూ బద్దశత్రువులుగా మారారు మరి అలాంటిది రోజా తెలుగుదేశంలో చేరడం అనేది సమ్మశక్యంకాని విషయం.

అయినా చంద్రబాబు నాయుడు, అధికారపక్షం చేస్తున్న నిర్వాకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతున్న రోజా.. ముఖ్యంగా కాల్ మనీ కేసులో, రిషితేశ్వరి కేసులో ఏకంగా చంద్రబాబు నాయుడునే  డైరెక్ట్ గా టార్గెట్ చేసిన రోజా ఏ రకంగా ఆ పార్టీలో చేరుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రోజా ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ అనధికారికంగా రోజాను ఓడించడమే లక్ష్యంగా పని చేసిందని ఆమె బాహాటంగా వెల్లడించారు. దాంతో మనస్తాపం చెందిన రోజా  ముందు నుండి చంద్రబాబు అండ్ కో మీద కోపంగా ఉన్నారు. దీని కారణంగా రోజా చంద్రబాబుతో విభేదించి పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరింది. కాలం మారి నగరి నుండి వైసీపీ శ్రేణుల ప్రోద్భలంతో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకే సవాల్ గా మారింది. మొత్తంగా గతకొద్ది రోజులుగా రోజా టిడిపిలోకి చేరతారు అన్న వార్తపై ఆమె స్పష్టంగా ‘చేరేది లేదు’ అని వెల్లడించడంతో ఈ పుకారుకు తెరపడినట్లైంది.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
సైన్యం చేతికి టర్కీ
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆట ఆడలేమా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
ఆ సిఎంను చూడు బాబు...
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
తెలంగాణ 3300 కోట్లు పాయె
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్

Comments

comments