సదావర్తి సత్రం షాకిచ్చింది

Sadavarthi satram shocks chandrababu Naidu

గుంటూరు అమరరామలింగేశ్వర స్వామి సదావర్తి సత్రానికి చెందిన భూముల విషయంలో హైకోర్టు ఏపి సర్కార్ కు షాకిచ్చింది. ముందు నుండి అనుకున్నట్లుగా ఏపి సర్కార్ తమకు కావాల్సిన వారికి అతి తక్కువ ధరకు సదావర్తి భూములను సమర్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు హైకోర్టు కూడా నమ్మింది. అందుకే కొనుగోలుదారులకు పత్రాలను అందించడానికి వీలులేకుండా…. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ మరోసారి చంద్రబాబు నాయుడు గొంతులో వెలక్కాయపడ్డ చందంగా మారింది.

కావాల్సిన వాళ్లకు దేవుడి భూములను అప్పనంగా అప్పగించిన వైనంపై కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. సదావర్తి భూముల వేలం నిబంధనల ప్రకారం జరగలేదని ఇప్పటికి రెండు పిటిషన్ లు దాఖలయ్యాయి. అయితే ఇందులో ఒక దానిని కోర్టు కొట్టివేసింది. తాజాగా ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు చివరకు సదావర్తి భూములను కొన్న వారికి కొనుగోలు పత్రాలను ఇవ్వవద్దంటూ నోటీసులు జారీ చేసింది. దాదాపుగా వెయ్యి కోట్ల విలువైన భూములను కేవలం 22 కోట్లకు మాత్రమే ప్రభుత్వం అమ్మిందని ఆరోపణలున్నాయి.

సదావర్తి భూములను ప్రభుత్వంలోని వారి తొత్తులు స్వాహా చేస్తున్నాయని గత కొంత కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కోర్టులో పిటిషన్ లు కూడా దాఖలయ్యాయి. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికి హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
మా టీవీ లైసెన్స్ లు రద్దు
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నయీం బాధితుల ‘క్యూ’
పోరాటం అహంకారం మీదే
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
BSNL లాభం ఎంతో తెలుసా?

Comments

comments