నెహ్వాల్ ఆట ముగిసిందా..?

Saina Nehwal game was over

భారత కీర్తి పతాకాలను అంతర్జాతీయంగా ఎగిరేలా చేసిన క్రీడాకారుల్లో మన హైద్రాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఒకరు. రియో ఒలంపిక్స్ నుండి ఆమె వెనక తిరిగిన నాటి నుండి వార్తల్లో లేనేలేదు. ఆ మధ్యన ఎవరో ట్విట్టర్ లో ఆమె గురించి రిటైర్మెంట్ తీసుకోవాలని కామెంట్ చేస్తే దానికి ఆమె రిప్లై ఇచ్చింది తప్పితే మరెప్పుడూ ఆమె వార్తల్లోకి రాలేదు. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటర్మైంట్ దగ్గర్లోని ఉన్నట్లే అనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే సైనా నెహ్వాల్ వైదొలిగింది. అయితే ప్రస్తుతం తన కెరీర్ డౌన్ ఫాల్లో ఉందని, చాలా మంది తన కెరీర్ ముగిసిపోవాలని కోరుకుంటున్నారని తెలిపింది. చాలా మంది తాను తిరిగి ఆటల్లోకి రాలేనని అనుకుంటున్నారని, తనకు కూడా అలానే అనిపిస్తోందని అంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలని సైనా నెహ్వాల్ తెలిపింది. కాగా అంతకు ముందు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ట్రెయినింగ్ తీసుకున్న సైనా నెహ్వాల్, కశ్యప్ తో ప్రేమలో పడిందని తెలిసింది. దాంతో ఈ ఇద్దరు హైదరాబాద్ లోని పుల్లెల అకాడమీలో కాకుండా కలకత్తాకు చెందిన ఓ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా పుల్లెల గోపీచంద్ అకాడమీని వదిలిన తర్వాత నుండి సైనాకు పెద్దగా అవకాశాలు, విజయాలు రాలేదు.

కాగా చాలా కాలం తర్వాత సైనా నెహ్వాల్ తిరిగి కోర్ట్ లో కనిపించనుంది. ఈ నెల 15 నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం సైనా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నానని.. తన పని అయిుపోయిందని ఇతరులు అనుకుంటే సంతోషమే అని తెలిపింది.  ఒకరకంగా ఇప్పటిదాకా వారు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అని అన్నది. ఇక నుంచైనా తన గురించి వారు ఆలోచించడం మానేస్తారేమోనని సైనా తెలిపింది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
సిరీస్ టీమిండియా సొంతం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments