భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి

Sakshi Malik gave excellent gift to India on Rakhi eve

సాక్షి మాలిక్ రియోలో మన మువ్వన్నెల జెండాను సగర్వంగా భుజాలకెత్తుకొని.. కోట్ల మంది కళ్లలో ఆనందం తీసుకువచ్చింది. హర్యానాకు చెందిన సాక్షికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 12 ఏళ్ల కలను నిజం చేసుకోవడానికి ఆమెపడిన కష్టానికి రియో వేదికగా గుర్తింపులభించింది. పట్టువదలకుండా చివరి క్షణం దాకా పోరాడిన సాక్షికి విజయం తలవంచింది. అనుకోకుండా వచ్చిన రెండో ఛాన్స్ ను మాలిక్ సద్వినియోగం చేసుకుంది. ఆమె కష్టానికి, ఆమె తపనకు యావత్ భారతం చేస్తోంది సలాం.

ఇక సాక్షి మాలిక్ కాంస్యాన్ని సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అర్థరాత్రి అయినా కూడా తమ కూతురు విజయాన్ని ఆ తల్లిదండ్రులు తనివితీరా తిలకించి. పులకించారు. రాఖీ పండగ సందర్భంగా తనకు ఇచ్చిన అరుదైన బహుమతి ఇదేనని.. ఇంతకు మించింది ఏముంటుంది అని ఆమె అన్న మీడియాతొ అన్నారు. ఇక హర్యానా ప్రభుత్వం సాక్షికి 2 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. రైల్వే ప్రకటించిన 50లక్షలతో కలిపి మొత్తం 2.5కోట్ల నజరానాను ఆమె సొంతం చేసుకుంది.

సాక్షి మాలిక్ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్విట్టర్ లో స్పందించారు. రాఖి పండగనాడు సాక్షి మాలిక్ భారత్ కు గొప్ప బహుమతిచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు. సాక్షి భారత ముద్దు బిడ్డ(Daughter of India) అని అన్నారు.

 

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments