సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది

Sakshi Malik life journey in sports

మరో నాలుగు రోజుల్లో రియో ఒలంపిక్ గేమ్స్ ముగింను దశకు చేరుకున్నాయి. అయినా కూడా ఒక్కటంటే ఒక్క పతకం కూడా లేదు. అసలు భారత్ రియో ఒలంపిక్స్ లో బోణీ ఎప్పుడు కొడుతుందా? ఒక్క పతకమైనా దక్కుతుందా?  అంటూ ఆశగా ఎదురుచూస్తున్న 125 కోట్ల భారత ప్రజల ఆశలను నిజం చేస్తూ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి రాఖీ పండుగ నాడు  ఒలంపిక్  పతకాన్ని  దేశ ప్రజలకు కానుకగా అందించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన మొదటి మహిళా రెజ్లర్ గా ఒలంపిక్స్ లో భారత్ కు పతకాన్ని తీసుకొచ్చిన 4 వ మహిళా క్రీడాకారిణి రికార్డ్ ను నెలకొల్పింది. హర్యానాలోని ఓ మారుమూల పల్లెటూరు లో పుట్టిన సాక్షి..12 యేళ్ల వయస్సు నుండే రెజ్లింగ్ ను స్టార్ట్ చేసింది.

అబ్బాయిలతో కుస్తీ పట్టి వారిని మట్టికరిపించేది.సాక్షి తో పట్టు పట్టడానికి ఆ ప్రాంతంలోని చాలా మంది అబ్బాయిలు సైతం భయంతో వణికిపోయేవారంటేనే  తెలుస్తుంది సాక్షి పోరాటతత్వం.  రెజ్లింగ్ అంటేనే సాహసక్రీడ..ప్రాణాలను సైతం లెక్కచేయని గేమ్..అందులో ఆడపిల్ల వద్దంటే వద్దు అని వారించిన బంధువులు..అయినా ఆమె తల్లిదండ్రులు సాక్షి నిర్ణయానికే ఓకే చెప్పారు. అనేక అడ్డంకుల నడుమ 23 యేళ్ల సాక్షి అంచెలంచెలుగా తన ప్రతిభను చాటుతూ నేడు అత్యుత్తమ  పతకమైన  ఒలంపిక్స్ పతకాన్ని సాధించి యావత్ దేశ ప్రజలకు సగర్వంగా అంకితమిచ్చింది.

గతంలో సాక్షి మాలిక్ సాధించిన పతకాలు:
2014లో గ్లాస్గో కామన్ వెల్త్ లో రజతం
2015లో దోహాలో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం
ఇప్పుడు 2016లో ఒలంపిక్స్ లో కాంస్యం

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments