సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?

Sania Mirza and Hingis seperated for that reason

గతేడాది ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా రెండు గ్రాండ్‌స్లామ్ లు, తొమ్మిది టైటిళ్లతో పాటు డబ్ల్యుటీఏ చాంపియన్‌షిప్‌ను సైతం సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 16 నెలల తమ భాగస్వామ్యానికి వీరు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.

ఇక నుంచి సానియా చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ బార్బోరా స్ట్రికోవాతో…  హింగిస్ అమెరికాకు చెందిన కోకో వాండెవేగ్‌తో కలిసి బరిలోకి దిగనున్నారు.  2015 మార్చిలో జత కట్టిన ఈ ఇద్దరు వరుసగా 41 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు, ‘హింగిస్‌తో సానియా భాగస్వామ్యం ముగిసింది. గత ఐదు నెలలుగా ఈ జోడి అనుకున్నంతగా రాణించలేకపోతోంది. టాప్-100కు పైగా ర్యాంకింగ్స్ కలిగిన ఆటగాళ్ల చేతిలోనూ ఓడిపోతున్నారు. అందుకే విజయాలు రానప్పుడు భాగస్వామిని మార్చుకోవడం మంచిది అని ఇద్దరూ భావించి వుంటారు . చివరిసారిగా ఈ జోడి గత నెలలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్‌లో పాల్గొని క్వార్టర్స్‌లో ఓడిపోయింది.

ఈ జోడీ అజేయ జైత్రయాత్రకు ఈ ఏడాది ఫిబ్రవరిలో దోహా ఈవెంట్‌తో బ్రేక్‌పడింది. అప్పటి నుంచి ఈ జోడీ అంతగా రాణించలేకపోతుంది. దీంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  ఓవరాల్‌గా సానియా-హింగిస్‌లు కలిసి 14 టైటిళ్లు సాధించారు. ఇందులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లున్నాయి. మొత్తం మీద ఈజోడి మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెల్చుకోవడం విశేషం. గతంలో సానియా చాలామంది పార్ట్ నర్స్ తో కలిసి ఆడినా హింగిస్ తో కలిసిన తర్వాత ఆమె దశ తిరిగిందనే చెప్పాలి . ఆమె సాదించిన విజయాల్లో మార్టినా హింగిస్ దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు . అయితే ఇపుడు ఈజోడి విడిపోవడంతో హింగిస్ లాంటి మరో ప్లేయర్ సానియాకు దొరుకుతుందా ?  మళ్లీ ఆస్థాయిలో విజయాలు సాదించగలుగుతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి .

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం

Comments

comments