సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్

Sania Mirza burn Rajdeep Sardesai over a casually question

ప్రపంచంలోనే మహిళా శక్తిని చాటుతున్న వాళ్లలో మన సానియామీర్జా కూడా ఒకరు. 29 ఏళ్ల వయసులోనే ఆమె… డబుల్స్‌ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉంది. భారతదేశ మహిళలకు ఓ ఐకాన్‌గా మారింది. వందేళ్ల జీవితకాల విజయాలను 29 ఏళ్లలోనే సాధించి… తన జీవిత చరిత్రను రాసుకుంది. అది ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఓ నేషనల్‌ ఛానల్‌ సీనియర్‌ రిపోర్టర్‌.. ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఓ సిల్లీ ప్రశ్న వేశాడు.

‘‘టెన్నిస్‌తో సెలబ్రిటీగా వెలిగిపోతున్నారు సరే… జీవితంలో ఎప్పుడు సెటిలవ్వబోతున్నారు? దుబాయ్ లో సెటిలవుతున్నారా? ఇంకేదైనా దేశంలోనా? ఇవన్నీ సరే… మాతృత్వం సంగతేంటి? పిల్లలను కనాలని, కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని మీకు లేదా? ఈ అంశాలేవీ మీ ఆటోబయోగ్రఫీలో పొందుపరచలేదు? ఇవన్నీ చూస్తుంటే ఇప్పట్లో రిటైర్‌ అయ్యేటట్టుగా, జీవితంలో సెటిలయ్యేట్టుగా లేరు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

దానికి సానియా ఘాటుగానే స్పందించింది. ‘‘నేను సెటిలయ్యానని మీరు ఇంకా భావించడం లేదా అని ఎదురు ప్రశ్నించింది’’ . దానికి మళ్లీ సమాధానమిస్తూ ఆ రిపోర్టర్‌… ‘‘అంటే మీ రిటైర్‌మెంట్‌ గురించి మాట్లాడలేదు, టెన్నిస్‌కు కాకుండా కుటుంబం గురించి, మాతృత్వం గురించి పుస్తకంలో రాయలేదు’’.. అంటూ తన ప్రశ్నించారు. దానికి సానియా ‘‘ఇలాంటి ప్రశ్నలడిగి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. వరల్డ్‌ నెంబర్‌వన్‌ అవ్వడానికి బదులుగా… తల్లి ఎందుకు కావడం లేదు” అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా సమాధానం చెబుతాను.. మహిళగా ఈ ప్రశ్నను నేను అనేక సార్లు ఎదుర్కొంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు చాలా మంది మహిళలు ఇదే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడూ అని అడుగుతారు, ఆ తరువాత పిల్లల్ని కనే ఉద్దేశం లేదా అన్నట్టుగా ప్రశ్నిస్తారు. అప్పటికే కెరీర్‌లో దూసుకుపోతూ ఉన్నా… ఎన్ని వింబుల్డన్స్‌ సాధించినా.. ప్రపంచ నెంబర్‌వన్‌గా పేరు సంపాదించుకున్నా.. ఇంకా జీవితంలో సెటిల్‌ కానట్టుగానే భావిస్తారు ఎందుకని. తల్లి కావడం అనేది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా జరుగుతుంది. అది జరిగినప్పుడు నేనే ముందుగా ఈ ప్రపంచానికి చెబుతాను” అంటూ సమాధానమిచ్చింది. ఇందుకు ఆ రిపోర్టర్‌ తరువాత ఆమెను క్షమాపణ చెప్పాడు. మీరు చెప్పిందే కరెక్ట్‌… ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడూ వేయనని వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
వాళ్లను వదిలేదిలేదు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
బతుకు బస్టాండ్ అంటే ఇదే
అకౌంట్లో పదివేలు వస్తాయా?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఛాయ్‌వాలా@400కోట్లు
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments