ఒక్క రూపాయికే చీర

Saree for one rupee only

ఒక్క రూపాయికే.. ఒకే ఒక్క రూపాయికే చీర. అవును, మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం కేవలం ఒకే ఒక్క రూపాయితో చీర అందుకోవచ్చు. ఇలాంటి వార్త ఆడవాళ్లకు తెలిస్తేనిజంగా పండగ చేసుకుంటారుగా. అలాంటి బంపర్ ఆఫర్ ఎక్కడ అని అనుకుంటున్నారా? మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ఇంతకీ ఆ బంపరాఫర్ ఎక్కడో ఇంకా చెప్పలేదని అనుకుంటున్నారా? బీద‌ర్‌లో సృష్టి-దృష్టి అనే శారీ సెంట‌ర్ య‌జ‌మాని ఒక్క రూపాయికే చీర‌ల‌ను అందిస్తున్నారు. ఆ నోట.. ఈ నోట అందరికీ చేరింది. మ‌హిళ‌లంతా త‌మ ప‌ని మానుకుని మ‌రీ క్యూలైన్ల‌లో నిల‌బడ్డారు. ఇసుకేస్తే రాల‌నంత మ‌హిళల‌తో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

అసలే చీరలు.. అందునా కేవలం రూపాయికే చీర అంటే ఆడవాళ్లు పిచ్చెక్కిపోరూ. ఎంతకష్టమైనా సరే ఆ రూపాయి చీరను సొంతం చేసుకునేందుకు నానాకష్టాలుపడతారు. దేశంలో డీమానిటైజేషన్ దెబ్బతో కష్టాలుపడుతున్న జనాలకు ఇప్పుడు ఈ వార్త సంచలనం రేపుతోంది. అయితే చీర ఒక్క రూపాయికి ఎలా ఇస్తున్నారబ్బా అనేగా మీ డౌట్. ఇక్కడ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. అదేమిటంటే..చీర కావాలంటే ఒక్క రూపాయి నోటు రూపంలో మాత్ర‌మే చెల్లించాలి. రూపాయి కాయిన్స్ తీసుకొన‌బ‌డ‌వు అని కండీషన్ పెట్టారు. షాపు ముందు బోర్డు పెట్టాడు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన మ‌హిళ‌లు నిరాశ‌కులోన‌య్యారు. అయితే కండీషన్ కు ఏ మాత్రం నిరాశ పడలేదు ఆడవాళ్లు. ఒక్క రూపాయి నోటు కోసం 10, 20 రూపాయలు చెల్లించి మరీ తీసుకున్నారు. ఇలా ఒక్క రోజులోనే 3వేల చీర‌ల‌ను అమ్మిన‌ట్లు యజమాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
నారా వారి అతి తెలివి
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
పవన్ పంచ ప్రశ్నలు
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments