సౌదీలో యువరాజుకు ఉరి

Saudi Arabia executes one of its princes over shooting murder

నేరం చేసినోడి సంగతి తర్వాత.. నేరం చేయాలన్నఆలోచన వచ్చేందుకు సైతం వణుకు పుట్టించేలా ఉంటాయి సౌదీలో శిక్షలు. తప్పు చేస్తే.. ఎంతటి వాడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్లుగా ఉండే అక్కడి రూల్స్ కు తాజాగా సౌదీ యువరాజునే ఉరితీసిన ఘటన అక్కడ చోటు చేసుకుంది.తప్పు చేసినోడు ఎంతటి వాడైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విషయాన్ని స్పష్టం అయింది.  2012లో సౌదీ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్.. తన స్నేహితుడైన అదెల్ అల్ మహ్మద్ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ పెరిగి.. చివరకు తన మిత్రుడ్ని కాల్చి చంపేశాడు. హత్యా నేరం మోపి సౌదీ యువరాజు మీద విచారణ జరిపారు.

ఆ ఉదంతంలో సౌదీ యువరాజు నేరం చేసినట్లు నిరూపితం కావటతో అతడికి ఉరిశిక్ష విధించారు. తాజాగా ఆ శిక్షను అమలు చేశారు. నేరం చేసిన వారికి కఠిన శిక్షలు విధించే సౌదీలో రాజకుటుంబానికి చెందిన వారికి ఉరిశిక్ష విధించటం అరుదైన వ్యవహారంగా చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. సౌదీలో అమలు చేస్తున్న ఉరిశిక్షలపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. సౌదీ యువరాజు కు విధించిన ఉరిశిక్షను రియాద్ లో అమలు చేశారు. తాజా ఉరిశిక్ష అమలుతో ఈ ఏడాది ఉరితీసిన వారి సంఖ్య 134కు చేరుకున్నట్లు అధికారవర్గాలు చెబుతన్నాయి.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ఈ SAM ఏంటి గురూ..?
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
రాజీనామాలు అప్పుడే
గెలిచి ఓడిన రోహిత్ వేముల
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
మంత్రుల ఫోన్లు బంద్
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
మోదీ చేసిందంతా తూచ్..
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
అతి పెద్ద కుంభకోణం ఇదే
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు

Comments

comments