బాకీలను రద్దు చేసిన SBI

SBI writes off Rs 7000 crore worth wilful defaulter loans

ఓ పక్కన దేశం మొత్తం కరెన్సీ గురించి చర్చించుకుంటోంది. ప్రతి ఒక్కరు తమ చేతిలో డబ్బులు లేవు అని బ్యాంకులకు క్యు కడుతున్నారు. అయితే బ్యాంకులు మాత్రం కొంత మంది బడాబాబులకు బంపరాఫర్ ప్రకటించేశాయి. ముఖ్యంగా SBI ప్రకటన విని అందరూ షాక్ అవుతున్నారు. 63 మంది బడాబాబులకు చెందిన… 7 వేల16 కోట్ల రుణాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. SBI ప్రకటించిన జాబితాలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వెయ్యి 201 కోట్లు, KS ఆయిల్ 596 కోట్లు, జెట్ పవర్ 400 కోట్లు, సాయి ఇన్ఫోసిస్టమ్స్ 376 కోట్లు, సూర్యా ఫార్మా కంపెనీకి 400 కోట్ల బకాయిలు ఉన్నాయి. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ కంపెనీ 6 వేల 963 కోట్లతో 17 బ్యాంకులకు బకాయి పడింది.

అలాగే 29 PSU బ్యాంకుల మొండి బకాయిల మొత్తం సుమారుగా 1లక్షా 14 కోట్లు ఉన్నాయి. ఒక్క SBI బ్యాంకుకే 40 వేల 84 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరోవైపు SBI నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్యుడు ఒక్కో రూపాయి జమ చేసుకున్న సొమ్మును… అప్పనంగా బడాబాబులకు, కార్పొరేట్ పెద్దలకు మాఫీల పేరుతో అవకాశాలు ఇవ్వడమేంటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజల్ని, రైతుల్ని, చిల్లర వ్యాపారుల్ని మొండి బకాయిలు చెల్లించేంత వరకు జలగల్లాగా పీల్చిపిప్పి చేసే బ్యాంకులు బడాబాబుల పట్ల ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
వీళ్లకు ఏమైంది..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
జియోకే షాకిచ్చే ఆఫర్లు
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
సౌదీలో యువరాజుకు ఉరి
బాబు గారి అతి తెలివి
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
చంద్రబాబు చిన్న చూపు
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments