శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Shashikala Chief Minister Strategy

తమిళనాడులో రాజకీయం రంగులు మారుతోంది. జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. జయలలిత తర్వాత పార్టీలో పార్టీలో నెంబర్ టూ ఎవరు అన్న దానికి దాదాపుగా జవాబు దొరికింది. తాజాగా జయలలిత తర్వాత ఆమె స్థానంలో పార్టీని నడిపించడానికి, ప్రజలను పాలించడానికి జయలలిత నిచ్చెలి శశికళ చాలా జాగ్రత్తగా పావులుకదుపుతున్నారు. జయ మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యుల పాత్ర, చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే మాత్రం శశికళ మొత్తం వ్యవహారాలను చాలా స్ట్రాటజిక్ గా చక్కబెడుతోందని క్లీయర్ గా అర్థమవుతుంది.

జయకు అనారోగ్యం చేసిన నాటి నుండి ఆమె నిచ్చెలి ఆమెతోనే ఉండింది. ఆస్పత్రిలో ఆమెతో పాటుగా ఉన్న ఆమె, చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించే వరకు కూడా ఉన్నారు. ఇక జయ మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యులు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆమె భర్త నటరాజన్, కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. పొయెస్ గార్డెన్ లో తర్వాత తమ అధికారమే అని పార్టీ వర్గాలకు దాదాపుగా సంకేతాలు పంపించారు. నటరాజన్ తో కొంత మంది మంత్రులు కూడా భేటీ కావడం రాజకీయంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుపుతోంది.

కాగా నాడు ఎంజీఆర్ చనిపోయినప్పుడు జయలలితకు ఎదురైన పరిస్థితులకు, నేడు జయ చనిపోయిన తర్వాత శశికళకు ఎదురైన పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. నాడు ఎంజీఆర్ అంతిమ సంస్కారాల్లో జయకు అవమానాలు ఎదురయ్యాయి. దాదాపుగా జయను కొట్టినంత పనైంది. కానీ శశికళకు మాత్రం అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకపోగా, జయ తర్వాత ఆమెనే అన్నట్లు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు దీన్ని శశికళ ఉపయోగించేపనిలోపడ్డారు.

ఇప్పటికి పన్నీర్ సెల్వం సిఎం పీఠంలో కూర్చున్నా కానీ దాన్ని తొందరలోనే శశికళ సొంతం చేసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే జయలలిత చనిపోయి కనీసం నాలుగు రోజులు కూడా కాకముందే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే అది అందరికి మంచిది కాదు అని శశికళకు తెలుసు. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ముగిసన తర్వాత నెమ్మదిగా అడుగులు వేసే అవకాశం ఉంది. తొందరలోనే కేబినెట్ పమావేశాన్ని నిర్వహించి, అక్కడ శశికళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.

జయలలిత తర్వాత పార్టీలో ఎంతో కీలకంగా మారుతున్న శశికళ ఇక డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నుండే తాను కూడా ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. జయలలిత మరణం తర్వాత రాబోయే ఆరు నెలల్లో ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయ పరిస్థితులను సెటిల్ చేసి తర్వాత ఎన్నికల్లో ఆర్కే నగర్ నుండి గెలిచి రాజకీయంగా ఎదిగేందుకు శశికళ పావులు కదుపుతోంది. మరి చూడాలి శశికళ వేసిన స్ట్రాటజీ ఎంత వరకు ఫలిస్తుందో.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ చంద్రుడి చక్రమే
ఎవరు చాణిక్యులు..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
జయను ఎందుకు ఖననం చేశారంటే?
రాహుల్ పై కరుణ ఆగ్రహం
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments