అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్

Shashikala master plan in appolo hospital

తమిళనాడు అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులో అన్నాడిఎంకె పార్టీ సెక్రటరీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏం జరుగుతుందో అని అందరూ అనుకున్నారు. కానీ అందరికన్నా ముందుగా జయలలిత నిచ్చెలి ఓ అడుగు ముందే ఉన్నారు. అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స జరుగుతున్నంత టైంలో శశికళ వేసిన అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జయ మరణానికి ముందే శశికళ మొత్తం పరిస్థితిని తన గుప్పిట్లో ఉంచుకున్నారని తెలుస్తోంది. పన్నీర్ సెల్వంతో సహా అందరిని శశికళ బాగా వాడుకుంటోంది అని తమిళనాడులో అందరికి తెలిసిన వాస్తవం. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో శశికళ భర్త నటరాజన్ అపోలోలో మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేస్తున్నారు.

అపోలో ఆస్పత్రిలో డిసెంబర్ 4వ తేది రాజకీయ పరిణామాలు చాలా జరిగాయి. అన్నాడిఎంకె పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ ఉన్నా కానీ వారు వెంటనే చెన్నైకి చేరుకోవాలని ఆదేశాలు అందాయి. అయితే బయటి ప్రపంచం మొత్తం అమ్మ ఆరోగ్యం మీద ఆరాలు తీస్తుంటే.. అపోలో మాత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజకీయాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో అసలు రాజకీయం చేసింది మాత్రం శశికళ, ఆమె భర్త నటరాజన్. హడావిడిగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం… అపోలో ఆస్పత్రి వర్గాలు అమ్మ మరణం వార్తను చెప్పిన కొన్ని గంటల్లోనే పన్నీర్ సెల్వం సిఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యడం మొత్తం నాటకీయంగా సాగింది.

ఇక్కడ మరో అంశం కూడా ఉంది. అన్నాడిఎంకే పార్టీలో జయలలిత పార్టీకి సుప్రీంగా ఉన్నారు. అమ్మ తర్వాత శశికళ నెంబర్ టూగా ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం ఉన్నా కానీ చిన్నమ్మ తర్వాతే ఆయన.అయితే పార్టీలో ఎలాంటి తిరుగబాటులేకుండా శశికళ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తమకు ఎప్పటికైనా ఎదురుతిరుగుతారు అనే అనుమానం వచ్చిన వెంటనే ఎమ్మెల్యేల చేత నాలుగు తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు రికార్డులో కూడా రాసేశారు. అయితే సాయంత్రం పార్టీ సర్వసభ్య సమావేశానికి అందరూ వెళ్లగా.. పన్నీర్ సెల్వంతో పాటు మరో ఐదు గురు దగ్గరి వారు మాత్రం వెళ్లలేదు.

అయితే రాత్రి 11.30గంటలకు అపోలో ఆస్పత్రి వర్గాలు అమ్మ మరణ వార్త చెప్పిన కొద్దిసేపట్లోనే గవర్నర్ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడం చూస్తుంటే మొత్తం కథను ముందుండి శశికళ, ఆమె భర్త నడిపించారు అనేది క్లీయర్ గా అర్థమవుతోంది. మొత్తానికి అప్పుడు జయలలిత ఎలాగైతే అందరూ తన మాట మీదే నడిచేలా చేసుకున్నారో.. ఇప్పుడు శశికళ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. మొత్తానికి శశికళ అసలు రాజకీయ నాయకురాలిగా మారింది అనేది వాస్తవం.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
దిగజారుతున్న చంద్రబాబు పాలన
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
జయ మరణం ముందే తెలుసా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
బీసీసీఐకి సుప్రీం షాక్
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments