ఆవిడతో లేచిపోయిన ఈవిడ

Rajasthan-Women-Love

అమ్మాయితో అబ్బాయి లేచిపోయాడు.. లేదంటే అబ్బాయితో అమ్మాయి లేచిపోయింది అన్న న్యూస్ చూసి ఉంటారు. కానీ పక్కింటి ఆవిడతో ఈవిడ లేచిపోయింది అన్న వార్త ఎప్పుడూ విని ఉండరు. అదేంటి ఆవిడతో ఈవిడ లేచిపోవడం ఏంటా అనుకుంటున్నారా..? అవును ఇద్దరు పెళ్లై, పిల్లలు కూడా ఉన్న మహిళలు లేచిపోయి.. ఏకంగా పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో ఆరు నెలలు గడిచిన తర్వాత ఓ ట్విస్ట్ ఇప్పుడు వార్తలకెక్కేటట్లు చేసింది.  ఇంతకీ అసలు ఆ ఇద్దరు మహిళల లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.

రాజస్తాన్‌కు చెందిన మమత, సోనియా పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు వివాహితలు. వీరిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో 2008లో వివాహమైంది. వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. భర్తలు, పిల్లలు బయటకు వెళ్లిపోయిన తర్వాత వీరిద్దరూ ఒక దగ్గరకు చేరి మట్లాడుకుంటూ ఉండేవారు. అలా వారి స్నేహం బలపడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చాక.. ఇద్దరూ తమ ఫ్యామిలీలను వదిలేసి లేచిపోయారు. తర్వాత ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. సోనియా భర్తగా వ్యవహరించి మమత మెడలో తాళి కట్టింది. అలా ఆర్నెళ్లు వారి కాపురం సజావుగా సాగాక.. వారి గురించి మమత కుటుంబ సభ్యులకు తెలిసింది.

మమత కుటుంబ సభ్యులు మమతో మాట్లాడి.. మీ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు.. కాబట్టి మాతో వచ్చేయండి అని నమ్మించారు. మమతో పాటు సోనియాను కూడా తమ వెంట తీసుకెళ్లిన మమత కుటుంబ సభ్యులు సోనియాను చితకబాది ఊర్లోనుండి తరమేశారు. మమత ఆ తర్వాత కనించకుండాపోయింది. అప్పట్నుంచి మమత జాడ కోసం సోనియా ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయినా లాభం లేకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మమత కోరికలు తీర్చడానికి తనకున్నవన్నీ అమ్ముకున్నానని, ఆమె ఆచూకీ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా చెబుతోంది. కోర్టు మమత కుటుంబ సభ్యులకు నోటీసులు పంపింది. మొత్తానికి ఇద్దరు మహిళల లవ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
అతడి అంగమే ప్రాణం కాపాడింది
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
సింగ్ ఈజ్ కింగ్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
రాజీనామాలు అప్పుడే
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
బాబు బండారం బయటపడింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
మోదీ హీరో కాదా?
గాలిలో విమానం.. అందులో సిఎం

Comments

comments