అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?

Sheela Balakrishnan is the Amma after Amma in Tamilnadu

దక్షిణభారతంలో తన మార్క్ పాలనతో తమిళుల ఆరాధ్య దైవంగా, అమ్మగా కీర్తిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం జయ ఆరోగ్యం మెరుగుపడుతుందని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయినా అభిమానుల్లో మాత్రం ఆదోళన తగ్గడం లేదు. పైగా మీడియాలో జయ ఆరోగ్య పరిస్థితి పై అనేక పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం తమిళనాడు లో పరిపాలన బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారనే సందేహం ప్రజల్లో ఉంది.దీనికి సమాధానంగా ఓ వార్త వినిపిస్తోంది.మంత్రి పన్నీర్ సెల్వమ్ అమ్మ కు అత్యంత సన్నిహితుడు.అయినా జయ పాలనా భాద్యతలు వేరొకరికి అప్పగించిందని అంటున్నారు.అమ్మ పాలనా భాద్యతలు అప్పగించింది మంత్రి వర్గం లోని వేరే వ్యక్తికి కాదు. అసలు మంత్రి వర్గం లోని వ్యక్తికే కాదు. ఆమె ఓ రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అధికారిని. ఆమె పేరు షీలా బాలకృష్ణన్.

జయలలిత తన ఆరోగ్య పరిస్థితిని ముందే గమనించి తన ఆరోగ్య సమస్యల వల్ల పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తకూడదని షీలా బాలకృష్ణన్ ను తన సలహాదారుగానియమించుకున్నారట. ప్రస్తుతం అనధికారికంగా తమిళనాడులో షీలా నే ముఖ్యమంత్రి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆమె నిర్ణయమే ఫైనల్ అని ఆమెకు సీనియర్ మంత్రులు సైతం అడ్డు చెప్పరని తమిళనాడు లో ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.జయలలిత ఆసుపత్రి లో చేరినప్పటినుంచి ఆమె తమిళనాడు పాలనను పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఆమె సలహా మేరకే తమిళనాడు సీఎస్. డిజిపి లు నడుచుకుంటారని అంటున్నారు.ప్రస్తుతం ఆమెకు అపోలో ఆసుపత్రిలో జయలలిత బ్లాక్ లోనే ఓ గదిని కేటాయించినట్లు తెలుస్తోంది. జయలలితకు మరో సన్నిహితురాలైన శశికళ కూడా అదే బ్లాక్ లో ఉంటున్నారు.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
సింగ్ ఈజ్ కింగ్
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఆటలా..? యుద్ధమా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
జగన్ సభలో బాబు సినిమా
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
గుదిబండగా మారిన కోదండరాం

Comments

comments