వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై

SI-Suicide-in-Medak

తెలంగాణలో కొత్త పోలీస్ వ్యవస్థకు బీజం వేసిన కేసీఆర్ సర్కార్ లక్ష్యానికి అప్పుడే బీటలు వారుతున్నాయి. పోలీస్ శాఖలో వేధింపులపర్వం ఎంత తీవ్రంగా ఉంటుందో తాజాగా ఓ ఎస్సై ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలో ఎస్సై సూసైడ్ కలకలం రేపుతోంది. కొండపాక మండలం కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్ లో సర్వీస్ రివాల్వర్ తోనే ఎస్సై కాల్చుకొని చనిపోయాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డెడ్ బాడీని గజ్వేల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. డిపార్ట్ మెంట్ లోని కొంతమంది ఉద్యోగుల తీరుతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ లేఖ రాశాడు రామకృష్ణారెడ్డి. ఆయన డెడ్ బాడీ దగ్గర సూసైడ్ లేఖ దొరికింది.

SI-Suicide2

తన చావుకు కారణం డీఎస్పీ, సీఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు కారణమని లేఖలో రాశాడు. మరో వైపు పాత సీఐ వెంకటయ్య పేరును కూడా ప్రస్తావించాడు. గతంలో మెదక్ తొగుటలో ఎస్సైగా పనిచేశాడు. మెదక్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ కాకముందు హైదరాబాద్ లక్డికపూల్, సుల్తాన్ బజార్ పీఎస్ లోనూ విధులు నిర్వర్తించాడు రామకృష్ణారెడ్డి. ఎస్సై రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామం. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. 2009 లో ఎస్ఐ గా సెలెక్టైన రామకృష్ణారెడ్డి గతంలో ఆర్మీలో పని చేశాడు. రెండు రోజుల క్రితమే భార్యను పుట్టింటికి పంపించాడు. రాత్రి 12.30 సమయంలో స్టేషన్లోని కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి తాను వెళ్లిపోతున్నానని… జాగ్రత్త అంటూ ఫోన్ చేప్పినట్టు సమాచారం. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ విచారణ చేస్తున్నారు.

SI-Suicide

ఒక్క రామకృష్ణారెడ్డి మొదటివాడు కాదు.. అలాగే ఆఖరి వాడు కూడా కాదు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నో సార్లు పోలీస్ అధికారుల వత్తిడి భరించలేక ఎంతో మంది కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత కాస్త వ్యవస్థలో మార్పు వచ్చింది అనుకుంటే తాజాగా రామకృష్ణా రెడ్డి ఆత్మహత్య పోలీస్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. మరి దీనిపై తెలంగాణ సర్కార్ స్పందించి.. పోలీస్ వ్యవస్థలో వత్తిళ్లకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
హరీష్.. ఇది నీకు సరికాదు
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
సైన్యం చేతికి టర్కీ
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
పోరాటం అహంకారం మీదే
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
మంత్రుల ఫోన్లు బంద్
అడవిలో కలకలం
తిరిగబడితే తారుమారే
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
బాబుకు గడ్డి పెడదాం
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments