గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?

Sindhu words after win in semi finals

రియోలో తన సత్తాను చాటాలని దృఢనిశ్చయంతో బరిలోకి దిగిన తెలుగు తేజం సింధూ బ్యాడ్మింటన్‌లో కొత్త వెలుగులను ప్రసరింపజేసింది. కేవలం ఒకే ఒక్క రోజు తేడాలో ఇద్దరు క్రీడాకారిణులు విశ్వక్రీడల వేదికపై రికార్డులను బ్రేక్ చేసి చరిత్రను తిరగరాశారు. కాగా రియోలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బంగారు పతకం ఇండియాకు సొంతం కావడం ఖాయం.  శుక్రవారం రాత్రి జరగనున్న ఆఖరి పోరులో సింధు గెలవాలని ప్రతి భారతీయుడు భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాడు.

నిన్నటి మ్యాచ్ అయిపోయిన తర్వాత  సింధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా టార్గెట్ గోల్డ్ అంతే.. అందుకు ఎన్ని అవరోధాలొచ్చినా ప్రత్యర్థులతో పోరాడి నెగ్గుతాను అని అన్నారు. నా టార్గెట్ అంతా ఒక్కటే ఏ మ్యాచ్ అయితే నేను ఆడతానో దానికంటే రెట్టింపు కసరత్తుతో ఆట సాగిస్తాను. తరువాత మ్యాచ్ టార్గెట్.. ఎలాగైనా గెలిచి తీరాలనే తపనతో ఖచ్చితంగా అనుకున్న గోల్ చేరుకుని విజయం దక్కించుకున్నాని’’ సింధూ మనసులో మాట బయటపెట్టారు.

‘‘అసలు రియోలో ఇక్కడిదాకా వస్తాననుకోలేదు. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కినట్లుగా పైకి వచ్చాను. ఇక… ఆఖరున మిగిలింది.. ఒక్క మ్యాచ్‌… కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌! ఇప్పుడు… నా టార్గెట్‌ గోల్డ్‌ మెడల్‌! అంతే దాని కోసం సర్వశక్తులా ఆడి గెలుపుకోసం పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. ఫైనల్లో నా సత్తా మొత్తం చూపిస్తానని సింధూ చెప్పారు. ఈ మ్యాచ్‌లో 100% శక్తిని ఉపయోగించి మరీ గెలుపు సాధిస్తా.. ఫైనల్ పోరుకు నేను సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. ‘‘నాపై ఎలాంటి ఒత్తిడి వంటిదేమీ లేదు. ఫ్రీ గానే ఆడి పోరాడతానని సింధూ స్పష్టం చేశారు. ఫైనల్స్‌కు సంబంధించి కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చెప్పిన వ్యూహాలను తూ.చ తప్పకుండా అనుసరిస్తా”.. అలాగే ఆటలో ప్రత్యర్థితో పోరాడి గెలిచి భారత్‌కు గోల్డ్ తీసుకొస్తానని సింధూ ధీమా వ్యక్తం చేశారు

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
అడుగుదూరంలో సింధు బంగారం
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం

Comments

comments