సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం

Social Media over social issues

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో చెప్పలేం. మొన్నటికి మొన్న పాకిస్థాన్ కు చెందిన ఓ ఛాయ్ వాలాను రాత్రికి రాత్రి పెద్ద సెలబ్రెటీని చేసింది సోషల్ మీడియా. సోషల్ మీడియా కారణంగా ఎన్నోఅద్భుతాలు జరిగాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అద్భుతాల గురించి మనం ఎక్కువగా మాట్లాడి.. దాని వల్ల కలుగుతున్న అనర్థాలను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మహిళ బ్యాంక్ ఉద్యోగి విషయంలో సోషల్ మీడియా చేసిన అతి అందరికి తెలిసిందే. ‘ఫాస్టెస్ట్ క్యాషియర్’ (fastest Cashier) అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు.

బ్యాంకుకు పని మీద వచ్చిన ఓ వ్యక్తి ప్రపంచంలో ఇంత కన్నా వేగంగా ఎవరన్నా పని చేస్తారా..? అని వెటకారంగా పోస్ట్ పెట్టేశాడు. దాన్ని వెంటనే కొన్ని వేల మంది షేర్లు చెయ్యడం కోట్ల మంది దానికి కామెంట్లు పెట్టడం జరిగింది. ఫాస్టెస్ట్ క్యాషియర్ పేరుతో జరిగిన ఈ ప్రచారం సోషల్ మీడియాలో తప్పుగా వచ్చింది అని తర్వాత తేలింది. అవును మహారాష్ట్ర బ్యాంకుకు చెందిన ఆ మహిళ దీన గాధ తెలుసుకున్న తర్వాత అందరూ తాము తప్పుగా అర్థం చేసుకున్నామని బాధపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్లిన ఆ వీడియో పుణెకు చెందిన ప్రేమలత అనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగిది. 2017లో ఆమె ఉద్యోగ విరమణ ఇవ్వనుంది. ఆమెకు గతంలో రెండు సార్లు హార్ట్ అటాక్స్, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆమె భర్త చనిపోయి కూడా చాలా సంవత్సరాలు గడిచింది. ఆమెను ఉద్యోగానికి రావద్దు అని ఎంత చెప్పినా కానీ వినలేదు. ఆమె రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగం నిర్వహించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న నెటిజన్లను ఏకిపారేస్తున్నారు సామాన్య జనం.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
సింగ్ ఈజ్ కింగ్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
చంద్రబాబు చిన్న చూపు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
తిరిగబడితే తారుమారే
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
దివీస్ పై జగన్ కన్నెర్ర
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
మంత్రి గంటా ఆస్తుల జప్తు
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments