మింగడంలో శభాష్ అనిపించుకున్నారు

Some of TDP leaders greater than Chandrababu Naidu

ఏపిలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకొచ్చే చంద్రబాబు నేమ్ ప్లేట్ ఎప్పుడో తుప్పుపట్టిపోయింది. దాన్ని మరింత మసకబార్చడంలో అధికారపక్షం నాయకులు తలోచెయ్యి వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల బాగానే పోగేసుకుంటున్న అధికారపక్ష నాయకులకు సంబందించిన వివరాలు కొన్ని ఈ మధ్యన వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతున్న తరుణంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు వాటాలేసుకుంటున్నారు.

అధికారపక్షానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మరికొంత మాత్రం బయటకు నీతులు చెబుతూ లోపల మాత్రం డబ్బులు సంపాదిస్తున్నారు. అసెంబ్లీలో మైకు దొరికితే చాలు తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించి, ప్రతిపక్షాలను నీచంగా చూసే బోండా ఉమా దగ్గరి నుండి బాబు హయాంలో పోగేసుకుని, సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే సత్యప్రభ వరకు అందరి బాగోతాలు మచ్చుకు కొన్ని బయటకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక.. గుడిని మింగే వాళ్లు ఎక్కువైపోయి చివరకు గుడిలోని లింగాన్ని కూడా మింగేస్తున్నారు.

చంద్రబాబు నాయుడును నిత్యం భజించే విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా బాగోతం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి కార్డుతో బోండా ఉమా నిర్వహించిన భూ దురాక్రమణ వెలుగులోకి వచ్చింది. తాజాగా విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా భూ కబ్జా బాగోతం బయటపడింది. విజయవాడ కండ్రిగలో రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని విలేకరులకు కేటాయిస్తామని చెప్పి ఆ భూమిని కబ్జా చేశారు. విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన విలువైన స్థలాన్ని తనకు సొంతమైందిగా చిత్రీకరించుకొని ఆ స్థలంలో వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. చంద్రబాబు అండ్ కో లో కీలకమైన మెంబర్ గా భావించే బోండా ఉమా చంద్రబాబు కనుసన్నల్లోనే ఇలా చేశారని చాలా మంది ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు.

ఇక గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, చాలా కాలం ప్రజాప్రతినిథిగా కొనసాగిన ఆదికేశవులు నాయుడు భార్య, ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో దాదాపుగా 43 నగదును పోలీసులు గుర్తించారు.  బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేయగా దాదాపు 265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపలేకపోయారు. దాంతో ఐటీ అధికారులు అన్నింటిని సీజ్ చేశారు. 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు ఆమెను ఆదేశించారు. నేను నిప్పును అనిచెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఐటీ దాడుల తర్వాత తమ ఎమ్మెల్యే గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

టోల్ ట్యాక్స్ లాగా ఓ ఎమ్మెల్యే తనకు ఐదు కోట్లు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్ ను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. టిడిపి ఎమ్మెల్యే రామకృష్ణ కాంట్రాక్టర్ ను బెదిరించాడు.. ఐదు కోట్లు ముట్టచెబితే కానీ పనులు కానివ్వం అని కాలడ్డేశారు. అయినా దీనిపై ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై మాత్రం ఖండిస్తూ కూడా ప్రకటన చెయ్యలేదు. ఈ విషయంపై జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు సైతం నోరుమెదపకపోగా వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తానికి చంద్రబాబు అండదండలతో బాబు అనుయాయులు బాగా దండుకుంటున్నారు అనే వాదన మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి మింగడంలో బాబు అనుయాయులు శభాష్ అనిపించుకుంటున్నారు అనడంలో మాత్రం ఎలాంటి అనుమానం లేదు.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
చంద్రుడి మాయ Diversion Master
ఆ అరుపులేంటి..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
వెనకడుగు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా లాభాలు
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments