ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Special Status Agitation in a different form

ఆంద్రుల ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఎయిర్ పోర్టు వద్ద అణిచి వేస్తే ఆగేది కాదు. సముద్రపు ఒడ్డున చెల్లాచెదురు చేస్తె ఆపేది కాదు. పార్లమెంటు సాక్షిగా భారత ప్రదాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా ప్రతి ఆంద్రుని హక్కు. దాన్ని చట్టం చేయవలసిన బాధ్యత ఏ పార్టి అధికారంలోకి వచ్చిన నెరవేర్చవలసిందే. అధికార దాహంతో చట్ట సభలను కించపరుస్తూ ఇష్టానుసారంగా రెండు జాతీయ పార్టీలు పోటిపడి మరీ ఇచ్చిన హామి ప్రత్యేక హోదా.

చట్టబద్దతలేని ప్రత్యేక ప్యాకేజితో ఆంద్రుడి హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా గొంతెత్తి అడిగినా.. కొవ్వొత్తులతొ శాంతియుతంగా ఉద్యమించిన ఎక్కడ ప్రత్యెక హోదా వచ్చేస్తుందో అని భయపడి పోయి పోలిసు యంత్రాంగాన్ని తప్పు దోరణిలో ప్రయోగించి ఉద్యమాలను అణిచివేసే కుటిల ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రత్యేక హోదాకు ప్రత్యెక ప్యాకేజికు తేడాలేదని బుకాయిస్తు రెండింటికి తేడా ఎమిటని.. ఇంతవరకు ఏ ఒక్కరుకూడా చదివి వినిపించ లేదని.. కావాలని ఒక అజ్ఞానిలా మాట్లడుతుంటే విద్యార్థులు, మీడీయా, మేదావులు, ఇతర పార్టీ నాయకులు విస్తుపోయే పరిస్తితి.

పన్ను రాయితీలు ప్రత్యేక హోదాలోనే ఉంటాయి అవి ప్రత్యేక ప్యాకేజిలో ఉండవు. కేవలం ధన సహాయం మాత్రమే ఉంటుంది. పన్ను రాయతీలు లేని కారణంగానే పరిశ్రమలు రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఏలుతున్న సొంత పార్టి నాయకులే ప్రత్యెక హోదా ఉన్న రాష్త్రాలలో పరిశ్రమలు పెట్టుకుంటే గుడ్లప్పగించి చూసే పరిస్తితి ఈ ప్రభుత్వానిది. అయినా రెండింటికి తేడా లేదని తేడా తెలియదని నటించడం అనేది ఒక దౌర్భాగ్యం. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెట్టి ప్రత్యేక హోదా హక్కును కాలరాచి కేంద్రంతో కుమ్మకై చేస్తున్న అవినీతి అరాచక పాలన అని సుష్పస్టంగా అర్థమవుతుంది. అందుకే మన హక్కును మనం సాదిద్దాం. మీ గోంతును వినిపించండి. ఈ విన్నూత్న ఉద్యమంలో పాల్గొనండి.

ఉద్యమం చేసే విదానం:
స్మార్ట్ ఫొనులో విడియోను రికార్డు చేయండి. ప్రతి ఒక్కరు గొంతు విప్పండి. రాష్ట్రాన్ని కేంద్రాన్ని ప్రశ్నించండి. మన హక్కును చాటి చెప్పండి. ప్రత్యేక హోదా ఆంద్రుని హక్కు అని నినాదించండి. విడియోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో అప్లోడ్ చేయండి. #APSpecialStatus అని టాగ్ చేయండి. మీ ప్రోఫైల్ పిక్ లో మీ ఫొటో పై విడియో సింబల్ ను పెట్టండి. ఇలా చేయడం వలన మీరు ఏదో మాట్లాడురు అని అందరికి అర్థమవుతుంది. మీ వీడియోను తప్పనిసరిగా చూడటం జరుగుతోంది. ఈ రకంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఎవరు కూడా ఉహించని విధంగా ముందుకు దూచుకోని వెళ్ళుతుంది.

– శ్రీచక్ర మల్లికార్జున

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
సౌదీలో యువరాజుకు ఉరి
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
బంగారం బట్టబయలు చేస్తారా?
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments