కడిగేశాడయ్యా.. బొంకయ్యా – హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి

Telakapalli Ravi questions on Venkiah Naidu about special status

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. ఓ పక్క బిజెపి నాయకులు ఆయనను సన్మానిస్తుంటే మరోపక్క చాలా మంది ఆయన మీద తిట్లదండకాలు చదువుతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఉన్నారు కాబట్టి అది మామలే అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వెంకయ్యా నాయుడు ఎంతటి మాటల గారడీ చెయ్యగలరో అందరికి తెలుసు. ఆయన మీద ఎవరైనా వ్యాఖ్యలు చెయ్యాలి అంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ అలాంటి వెంకయ్యకు చివాట్లు మాత్రం తప్పడం లేదు. ఏపికి ప్రత్యేక హోదాతో కనీసం మంచి చేస్తే తిరిగి తిట్లు ఏంటి అని ఆయన అనుకున్నా కానీ.. విమర్శల పర్వానికి మాత్రం తెర పడటం లేదు.

తాజాగా సీనియర్ పాత్రికేయుడు, విశ్లేషకుడు తెలకపల్లి రవి ఓ వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఎందుకు మాట తప్పింది అని నిలదీస్తున్నారు. నాడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా మీద అరిచిగీ చేసిన వెంకయ్య ఇప్పుడు మాత్రం మిన్నకున్నారంటూ విమర్శించారు. ఏపికి ఎందుకు ప్రత్యేక హోదా కల్పించాలి అని ఆనాడు వెంకయ్య నాయుడు.. ఆర్థికంగా నిలదొక్కుకోలేని సందర్భంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పింవచ్చు అని అన్నారు. మరి ఈనాడు అదే పరిస్థితి ఏపిలో ఉంటే ఎందుకు ప్రత్యేక హోదా కల్పించడం లేదు అని ప్రశ్నించారు.

పద్నాలుగో ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దు అని అనలేదని తెలకపల్లి రవి గుర్తు చేశారు. పద్నాలుగో ఆర్థిక సంఘం నివేదికలో కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనలో కానీ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు అని స్పష్టం చేశారు. భౌగోళిక పరిస్థితులను బట్టి మాత్రమే ప్రత్యేక హోదా కల్పించాల్సి వస్తుంది అన్న విషయం అందరికి తెలుసునని.. కానీ ఆర్థిక స్వావలంబన కోసం కూడా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు అన్న విషయం వెంకయ్య నాయుడుకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రశ్న.

సత్యాన్ని దాచేసి సన్మానాలు చేయించుకుంటున్న వెంకయ్య నాయుడు పరిస్థితిపై తెలకపల్లి రవి ఘాటుగా స్పందించారు. ఏపికి ఏదో పెద్ద సహాయం చేసినట్లు సన్మానాలు చేయించుకుంటున్నారని కానీ సత్యాన్ని దాచేసి.. సన్మానాల పేరుతో మీడియాలో బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. విజయవాడ సభలో కూడా వెంకయ్య నాయుడు ఏపి మంచి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తాను ప్రత్యేక హోదాను డిమాండ్ చేసినట్లు చెప్పారని కానీ మరి అలాంటి ప్రత్యేక హోదాను ఎందుకు పొందలేకపోయారు అని అన్నారు.

హోదా స్థానంలో కొత్తగా ఇచ్చినవి ఏంటి అన్న దానిపై ఒక్క ముక్కైనా చెప్పారా..? అని వెంకయ్య నాయుడును తెలకపల్లి రవి ప్రశ్నించారు. కొండంత అవాస్తవాన్ని తీసుకువచ్చి మాటల గారడీతో మభ్యబెట్టాలని చూడటం అనుచితమైంది, అభ్యంతరకరమైంది అని ఆయన అన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించకపోవడం, ప్రశంసించడం ఏంటి అని, దాని వల్ల తెలుగు ప్రజలు దీన్ని గమనిస్తారు అని అన్నారు. ప్రత్యేక హోదాకు, ట్యాక్స్ హాలీడే ఎలాంటి సంబందం లేదు అని అంటున్నారు.. మరి అలాంటి సంబందంలేని విషయం మీద ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాడు చేసిన తప్పులను వారు సమర్థించుకుంటే… బిజెపి చేస్తున్న దానిపై వెంకయ్య నాయుడు సమర్థించుకోవడం అనే రెండు సమర్థనల మధ్య తేడాను తెలుగు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు అని ఆయన అన్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. దానికి వంతపాడిన వారికి కూడా మూల్యం తప్పదు అని అన్నారు. సత్కరించే వాళ్లుంటే సన్మానించుకోవచ్చు.. దండలు వేయించుకోవచ్చు.. కార్లుంటే ఊరేగవచ్చు కానీ నిజం మాత్రం దాచేస్తే దాగదు అని గమనించాలి అంటూ వెంకయ్యను బొంకయ్యను చేసి తూర్పారబట్టారు తెలకపల్లి రవి.

Related posts:
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
పవన్ ను కదిలించిన వినోద్
వెనకడుగు
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా లాభాలు
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments