ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని

sxpe2

విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా నాటి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రత్యేక సహాయం పేరుతో మరోసారి ఏపి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. కాగా కేంద్రం ఇస్తున్న ప్రత్యేక సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి తలూపుతూ చేసిన ప్రకటన అందరిని బిత్తెరపోయేలా చేసింది. అసలు అందరూ చెబుతున్నట్లు ఏపికి ప్రత్యేక హోదా అనేది సంజీవనిగా పని చేస్తుందా ..? లేదా..? అన్న వివరాలు మీ కోసం.

be

ప్రత్యేక హోదా సంజీవని ఎందుకంటే..
(హోదా వల్ల కలిగే లాభాలు)
1) మొదటి అయిదేళ్లకు 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, తరువాత అయిదేళ్లకు 30 శాతం మినహాయింపు
2)30 లక్షల వరకూ గరిష్ట పరిమితితో…. మూలధన పెట్టుబడులపై 15 శాతం రాయితీ
3)విస్తరణ, ఆధునీకరణ, స్థాపన… ఏ అవసరం కోసమైనా సరే వచ్చే ప్లాంట్లు, మెషినరీలపై ఎంట్రీ టాక్సు రద్దు
4)భూవినియోగ మార్పిడి, అభివృద్ధి ఛార్జీల హేతుబద్ధీకరణ
5)ఐటీ పార్కులు, కమోడిటీ పార్కులకు సంబంధించి భూములకు కట్టే స్టాంపు డ్యూటీలో భారీ తగ్గింపులు
6)ఏడాదికి రెండు లక్షల దాకా గరిష్ట పరిమితితో మూడు శాతం వడ్డీ తగ్గింపు… ఇవి కొత్తగా ఏర్పాటయ్యే చిన్న తరహా పరిశ్రమలకు, ప్రస్తుత చిన్న తరహా పరిశ్రమల ఆధునీకరణకు వర్తిస్తుంది… ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంస్థ, బ్యాంకు ఉత్తరాఖండ్ లో ఉన్నట్టయితే చాలు, సక్రమంగా రుణవాయిదాలు చెల్లించాలనేది షరతు
7)మరీ మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, థ్రస్ట్ ఇండస్ట్రీస్ గా గుర్తింపు పొందిన పరిశ్రమలకు ఏటా 3 లక్షల గరిష్ట పరిమితితో అయిదు శాతం వడ్డీ తగ్గింపు
8)కంపెనీ లేదా ఫ్యాక్టరీ బుక్ వాల్యూలో కనీసం 25 శాతం వరకూ అదనంగా పెట్టుబడులు పెట్టి విస్తరిస్తే, లేదా ఆధునీకరిస్తే వాటికి వడ్డీ రాయితీల వర్తింపు
9)ఖాయలా పడిన చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణకు కూడా ఏటా రెండు లక్షల గరిష్ట పరిమితితో 3 శాతం వడ్డీ రాయితీ, మారుమూల కొత్తగా పెట్టే పరిశ్రమలను పెట్టే ఔత్సాహికులకు ఏటా 3 లక్షల గరిష్ట పరిమితితో 5 శాతం వడ్డీ రాయితీ
10)చిన్నతరహా పరిశ్రమల జాబితాలో లేకుండా ఖాయిలాపడిన పరిశ్రమలైతే, రుణాల పునరుద్ధరణకు ప్రభుత్వపరమైన ప్రోత్సాహం
11)కొత్త మల్టీప్లెక్స్ ప్రాజెక్టులకు మూడేళ్లపాటు 100 శాతం వినోదపన్ను మినహాయింపు, కొత్త అమ్యూజ్ మెంట్ పార్కులు, రోప్ వే లకు అయిదేళ్లపాటు 100 శాతం వినోదపన్ను మినహాయింపు
11)ఐఎస్ఓ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాణ్యత సర్టిఫికెట్లను పొందటానికి అయ్యే వ్యయంలో 75 శాతం చెల్లింపు, గరిష్ట పరిమితి 2 లక్షలు
12)కాలుష్య నివారణ పరికరాలను బిగించుకునే ఔత్సాహికులకు వాటి వ్యయంలో 50 శాతం చెల్లింపు, గరిష్ట పరిమితి లక్ష
13)పేటెంట్ల రిజిస్ట్రేషన్ ఖర్చులోనూ ఔత్సాహికులకు 75 శాతం చెల్లింపు. రెండు లక్షల గరిష్ట పరిమితి
14)చదువుకున్న నిరుద్యోగులయితే ప్రధాని రోజ్ గార్ యోజన కింద ఉత్పత్తి యూనిట్ల కోసం 2 లక్షలు, చిన్న వ్యాపార సంస్థలయితే లక్ష రూపాయల వరకూ రుణసదుపాయం, దాంతోపాటు ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం రాయితీ
15)ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
16)ప్రభుత్వ శాఖల కొనుగోళ్లలో ఈ చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తులకే ప్రాధాన్యం
17)చిన్నతరహా పరిశ్రమల జాబితాలో లేకపోయినా సరే, రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల నుంచి కూడా ప్రభుత్వ కొనుగోళ్లకు ప్రాధాన్యం..

uttarakhand

దేశంలో ప్రత్యేక హదా కలిగిన రాష్ట్రాలు 11 ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వల్ల కలిగింది ఏమీ లేదు అని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అసలు ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని కాదు అని ఆయన అంటున్నారు. మంత్రివర్గ సభ్యులు కూడా అందుకు తలూపుతున్నారు. మన వాళ్లు చెబుతున్నట్లు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లు అసలు ప్రత్యేక హోదా వల్ల లాభం పొందలేదు కదా..మీద నుంచి నష్టపోయాయి అని బిల్డప్ ఇస్తున్నారు. కానీ నిజానికి అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి.

మన వాళ్లు చెబుతున్నట్లు ఉత్తరాఖండ్ లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే కొన్ని వివరాలు చూడాలి. 2003 లో ప్రత్యెక హోదా ప్రకటించక ముందు ఉత్తరఖాండ్ లో 1907 పరిశ్రమలు ఉంటె అందులో 300 నుండి 400 వరకు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. 2002 నుండి 2016 మార్చ్ 31 నాటికి 5407 పరిశ్రమలు అయినాయి . మరి ఇక్కడ ఇన్ని పరిశ్రమలు రావడానికి కారణం ప్రత్యేక హోదా కాదని ఎవరు మాత్రం అంటారు చెప్పండి.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ప్రత్యెక హోదా తీసేయమని ఏ ఆర్దిక సంఘం కూడా చెప్పలేదు… 12 వ ఆర్దిక సంఘం ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇవ్వవద్దు అని చెప్పలేదు.. 14 వ ఆర్దిక సంఘం ప్రత్యెక హోదా తీసేయమని చెప్పలేదు. 2007 లో అప్పటి UPA ప్రభుత్వం ప్రత్యెక హోదా ప్రయోజనాల్లో కొన్ని మార్పులు తెచ్చింది. దాని వలన నిన్న చెప్పుకున్నట్టు కొన్ని ప్రయోజనాలు 10 ఏళ్ల పాటు అంటే 2017 వరకు ఉంటాయి. దీని వలన ఒక్క ఉత్తరఖాండ్ లో 2007 లో 1907 ఉన్న పరిశ్రమల సంఖ్య2013 మార్చ్ నాటికి 14440 కి పెరిగిన మాట వాస్తవం.

మరి ఇన్ని లాభాలున్న ప్రత్యేక హోదాను ఏపిలో ఉన్న అధికారపక్షం మాత్రం వద్దు.. మాకు ప్యాకేజీనే ముద్దు అని అంటోంది. ప్యాకేజీ ముద్దు ఎందుకో అందరికి తెలుసు. అసలే రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది అని ముందు నుండి చెబుతున్నా.. ఎందుకు సంజీవనిలాంటి ప్రత్యేక హోదా కోసం అధికారపక్షం పోరాటం లేదో అర్థం కావడం లేదు. మైకులు దొరికితే చాలు రాజకీయం కోసమే అలా చేస్తున్నారు అనే అధికారపక్ష నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments