తెలంగాణకు ప్రత్యేక అండ

telangana

Central Minister Arun Jaitley assured to telangana for special support. Telanagana Minister KTR Met Arun Jaitley on Bifurcation law.

ఏపికి ప్రత్యేక సహాయానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈమేరకు ఏపికి ఎలాంటి సహాయం చెయ్యబోతోందో కేంద్రం పిఐబి వెబ్ సైట్ లో పొందుపరిచారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పడ్డ ఏపికి కేంద్రం సహాయానికి ముందుకు రావడంతో ఇప్పుడు తెలంగాణ కూడా సహాయాన్ని కోరుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఐదేళ్లపాటు ఇచ్చే రాయితీలను, పారిశ్రామిక ప్రోత్సాహకాలను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ కోరుతోంది.

తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్ర పాలనలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగానే వాటిని అనుభవించలేకపోయిందని, ఫలితంగా తీవ్ర అన్యాయానికి గురైందని కేటీఆర్ అరుణ్ జైట్లోతో భేటీ తర్వాత అన్నారు. వివక్ష కారణంగానే ప్రజలు పోరాడి, ఉద్యమించి, త్యాగాలు చేసిన తర్వాత రాష్ర్టాన్ని సాధించుకుని మిగిలిన రాష్ర్టాలతో పోటీపడుతూ ముందుకు దూసుకుపోతూ ఉన్నదని చెప్పారు.త్యాగాలు చేసి వెనుకబాటుతనం నుంచి బయటపడిన తెలంగాణ ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నదని కేటీఆర్ తెలిపారు.

నీతి ఆయోగ్ సైతం మిషన్ భగీరథకు 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశానని తెలిపారు. దీన్ని అమలులోకి తేవాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి కోసం ఏటా 50 కోట్ల నిధులను కేటాయించిందని, తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడి ఉన్నట్లుగా కేంద్రమే గుర్తించిందని గుర్తుచేశారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే 450 కోట్ల నిధులు విడుదలయ్యాయని, ఇంకా రెండు విడుతల నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఇప్పటికే మూడు విడతలుగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 2020 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు కూడా విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94లో పేర్కొన్నట్లుగా పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఆర్థిక వనరులు సమకూర్చాల్సి ఉందని కేటీఆర్ అరుణ్ జైట్లీని కోరినట్లు తెలుస్తోంది. ఏపీకి ఐదేళ్ల వరకు వీటిని సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దృష్ట్యా అదే చట్టం ప్రకారం తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. తెలంగాణకు కూడా ఈ రకంగానే న్యాయం చేయాలని, వివక్ష లేని విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేయడంపై లేదా ఆర్థిక వనరులు సమకూర్చడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తెలంగాణను మరిస్తే  ప్రజలు తప్పుబట్టే ప్రమాదం ఉంటుందని, అది లేకుండా చూసుకోవాలని మంత్రికి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.

కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ తర్వాత అరుణ్ జైట్లీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ కేంద్రం తెలంగాణ సర్కార్ కు బాసటగా నిలుస్తోందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వెనకబడిన జిల్లాల దగ్గరి నుండి విభజన చట్టంలోని అన్ని హామీలను తాము నెరవేరుస్తామని అరుణ్ జైట్లీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై కేటీఆర్ కు ప్రత్యేక అండ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి అరుణ్ జైట్లీ ఏపికి ప్రత్యేక సహాయాన్ని, తెలంగాణకు ప్రత్యేక అండకు ముందుకు వచ్చారు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
ఆయనకు వంద మంది భార్యలు
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
అంత దైర్యం ఎక్కడిది..?
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
2018లో తెలుగుదేశం ఖాళీ!
మంత్రుల ఫోన్లు బంద్
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
చంద్రబాబు చిన్న చూపు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Comments

comments