ఏలూరు వెనక ఇంత కథ ఉందా?

Story behind Pawan Kalyan's eluru plan

ఏపిలో రాజకీయాలకు సినిమా ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అయింది. గత ఎన్నికల సందర్భంగానే ఈ సినిమా ఫ్లేవర్ వచ్చినా కానీ వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరగనుంది. ఈ మ్యాటర్ అంతా ఎవరి గురించో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. జనసేన పేరుతో పార్టీని స్థాపించి, తాజాగా హైదరాబాద్ నుండి తన మకాంను ఏపికి మార్చుకున్న పవన్ కళ్యాణ్ గురించి. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి పార్టీలకు మద్దతు పలికిన జనసేనాని వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఏలూరులో తన ఓటును నమోదుచేయించుకోవడానికి అప్లై చేసుకున్నారు. కాగా పవన్ ఇలా ఏలూరునే ఎందుకు ఎంచుకున్నారు.? అంటే దానికీ కారణాలున్నాయి.

ముందుగా చెప్పుకోవాల్సింది ఏలూరులోని ఓటు బ్యాంకు పవన్ ను ఏలూరుకు వెళ్లేటట్లు చేసింది. ముందు నుండి వర్గ సమీకరణలకు వేదికగా నిలిచే ఏపిలో తాజాగా పవన్ కూడా బహుశా అదే లెక్కన ఏలూరును లెక్కలేసి ఉంటాడు. పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఏలూరుగా చాలా బలంగా ఉంది. అదే అక్కడ ఓటు తీర్పును నిర్ణయిస్తుంది అందుకే పవన్ అక్కడికి వెళ్లడానికి చాలా ఇంట్రస్ట్ చూపించారు. కాగా ఇదొక్కటే కాకుండా మరో కోణం కూడా ఉంది.

ఏపి ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ఎటు మొగ్గితే అధికారం ఆ పక్షాన్ని వరించడమే ఇందుకు కారణం. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్ర రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆ రెండు జిల్లాల్లోనే 34 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దీంతో ముందుగా ఈ రెండు జిల్లాల్లో పాగా వేయాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహం. అందుకే ఏలూరు కేంద్రంగా తాను రాజకీయాలను నడిపించాలని అంచనాలు వేసి, ఆ మేరకు ఏలూరును తన వేదికగా ఎంచుకొని ఉండవచ్చు.

Related posts:
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ చంద్రుడి చక్రమే
టాప్ గేర్ లో ముద్రగడ
బాబు Khan
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
వెనకడుగు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
తొక్కితే తాటతీస్తారు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments