దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు

straight Questions to Dasari Narayana Rao and Co who is protesting for Kapu reservations

గతకొంత కాలంగా ఏపిలో జరుగుతున్న పరిణామాల మీద కాస్త ఆలస్యంగా మేలుకున్న దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, అంబటి రాంబాబులు తెగ హైరానాపడుతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ హోటల్ లో కూర్చొని.. మీటింగ్ నిర్వహించుకున్న దాసరి అండ్ కో ముద్రగడకు ఏం జరిగినా ప్రభుత్వానికే బాధ్యత అని తేల్చేసింది. చంద్రబాబు నాయుడు మాట తప్పినందుకే ఈ ఉద్యమం ప్రారంభమైంది అన్న దాసరి.. వంగవీటిని ఇప్పటికే పోగొట్టుకున్నాం. ఇక ముద్రగడను చూస్తూ చూస్తూ పోగొట్టుకోలేం అని అన్నారు. ఇక తాజాగా ఏం జరిగినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

పనిలోపనిగా మీడియా మీద కూడా చిందులుతొక్కారు. మీడియాలో తమ గురించి అర నిమిషం కూడా వెయ్యడం లేదని.. గొంతుచించుకొని సమస్య గురించి మాట్లాడినా కానీ ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. మేం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యల చేయగలం.. మరి అలాంటి వాటికే మీరు ప్రాధాన్యతనిస్తారా అని మీడియా మీద శివాలెత్తారు. అయినా ఇక్కడ ఓ అనుమానం కలుగుతోంది. దాసరికి నిజంగా కాపుల మీద చిత్తశుద్దితో ఇదంతా చేస్తున్నారా..? లేదంటే మీడియాలో తనకు కాపు నాయకుడు అనే పబ్లిసిటి రావాలనే చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక చంద్రబాబు నాయుడు తప్పు ఉంది కాబట్టే కాపు నాయకులు అందరూ కూడా ఏకమవుతున్నారు. కాపులకు గతంలోనే తగిన న్యాయం చేస్తానని, ప్రభుత్వం వారి అభివృద్దికి నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చలేదు. మరి దీని మీద ముద్రగడ దూకుడు మీదున్నారు సరే.. కేంద్ర మంత్రులుగా పని చేసిన దాసరి. చిరంజీవి, పల్లం రాజులకు అసలు విషయం తెలియదా..? ప్రభుత్వం ఎందుకు ఇంతలా ఆలోచిస్తుందో అని..?

Related posts:
అమావాస్య చంద్రుడు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments