మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు

Strategically Telugu Media minimizing Lokesh role in Politics

తమ్ముడు మనోడే అయినా కూడా న్యాయం ఎక్కడుంటే అటువైపు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ధర్మం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పక్షపాత వైఖరి అంటే ఏమిటో మీడియాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా దానికి తాటికాయ అక్షరాలతో మీడియాలో వేస్తున్నారు అంటూ యెల్లో జర్నలిజం అనే పదాన్ని సృష్టించారు ఓ వర్గం. అయితే నిజానికి యెల్లో జర్నలిజం ఎక్కడ జరుగుతోంది అనేది కాస్త లోతుగా చూస్తే మనకే అర్థమవుతుంది. నారా లోకేష్ మాట్లాడిన మాటలనే పరిశీలిద్దాం.

తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.కేసీఆర్ నిర్వాకాన్ని నిలదీస్తూ సూటిగా ప్రశ్నించారు. కానీ దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు రాశారు. చివరకు చంద్రబాబు నాయుడు కరపత్రాలు అని పేరుతెచ్చుకున్న పత్రికలు, మీడియా ఛానల్స్ కూడా లోకేష్ మాట్లాడిన మాటలకు పెద్దగా ప్రయార్టి ఇవ్వలేదు. తమ పార్టీ కార్యక్తల భీమా చెక్కులను పంపిణీ చేసే సమయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలించండి.

మిగులు బడ్జెట్‌‌తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు లోటు బడ్జెట్‌లోకి పోయిందని లోకేష్ అన్నారు. అంతేగాక, సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. అసలు ఇందులో ఎక్కడ తప్పు ఉంది. దేశంలో ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉంది అని నిన్నటి దాకా జబ్బలు చరుచుకున్న కేసీఆర్ ప్రభుత్వం మరి ఇప్పుడు నిధుల కోసం పొలోమని కేంద్రం ముందు ఎందుకు తలొగ్గింది అనేది ఆలోచించాలి. గతంలొ కేంద్రం పట్టించుకోకున్నా తాము మాత్రం చేసి తీరుతాం అన్నారు.. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. మాట తీరులో ఇంత తేడా ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలి.

ఇక టీఆర్ఎస్ నేతలు తాము కూడా తమ కార్యకర్తలకు బీమా ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని.. వారు ఎంత మందికి ఇచ్చారో? చెప్పాలని లోకేష్ నిలదీశారు. నిజమే పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భీమా సౌకర్యాన్ని చేపట్టింది అని ప్రకటన రాగానే వెంటనే రంగంలోకి దిగిన టిఆర్ఎస్ బృందం తాము కూడా భీమా సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని లెక్కలు కట్టి మరీ చెబుతున్న లోకేష్ మరి టిఆర్ఎస్ ఏం చేసింది అని ప్రశ్నించడంలో ఎలాంటి తప్పులేదు.

తెలంగాణ బంగారు తెలంగాణ అయితే కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారంటూ ధ్వజమెత్తారు. దళితులకు భూ పంపిణీ, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణలో ఏ ఆంధ్రా పార్టీ అడ్డు పడింది? నిజమే లోకేష్ చెప్పిన వాటికి ఏ ఒక్కదానికి ఏ ఆంధ్రాపార్టీ అడ్డుపడలేదు. మరి వాటిని అమలు చెయ్యడానికి ఏంటి ..? కానీ అలా చెయ్యడంలేదు అని లోకేష్ ప్రశ్నిస్తే మాత్రం ఒక్కో మీడియాలో ఒక్కో రకంగా రాశారు.

లోకేష్ మాట్లాడిన దానిపై మీడియాలో వచ్చిన కథనాల టైటిల్స్ ఇలా ఉన్నాయి..

Lokesh-Counter01

Lokesh-Counter02

Lokesh-Counter03

Lokesh-Counter04

మరి నిజంగా నారా లోకేష్ యెల్లో జర్నలిజం చేసి ఉంటే ఇలా ఎవరైనా రాస్తారా..? మీడియా మేనేజ్ మెంట్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు దీనిపై ఏమంటారు..? అన్నింటికి మించి తెలుగు మీడియా లోకేష్ ను ఎందుకు చిన్న బాబుగా చూస్తుంది అనేది తెలియాలి.

ఇది లోకేష్ కు అనుకూలంగా రాసింది కాదు.. కేవలం మీడియా వైఖరి ఎలా ఉంది అని చెప్పడానికి మాత్రమే రాసింది.

  • Abhinavachary
Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
ఆ అరుపులేంటి..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
మెరుపు దాడి... నిజమా-కాదా?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
జగన్ క్రిస్టియన్ కాదా!
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments