‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

student-threatened-ice-crea

A student named Hemanth who was drunk, has threatened a ice cream vendor with air gun to reduce the cost. But, at that time police entered in scene and arrested him.

ఈమధ్య ఆకతాయి విద్యార్థులు వేసే వేషాలకు, చేసే పనులకు అంతే ఉండటం లేదు. తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సిటీ లైఫ్ విచిత్రంగా ఉంటుంది. అర్థరాత్రులు ఫుల్‌గా తాగిన తరువాత ఐస్‌క్రమ్ తినాలనుకుంటారు. ఇది కాలానికి సంబంధం ఉండదు. వర్షమైనా, చలైనా తినాల్సిందే. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలో ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫుల్‌గా తాగిన విద్యార్థి ఒకడు ఏకంగా గన్ బయటకు తీశాడు. ఇలాంటి సంఘటనలు అమెరికాలో నల్ల జాతీయులు చేస్తారని వింటూ ఉంటాం కానీ ఇది అచ్చంగా తెలుగు ప్రాంతమైన తెలంగాణలోని రాజధాని నగరంలో జరిగింది.

హేమంత్ రెడ్డి అనే వ్యక్తి ఐస్‌క్రమ్ అమ్మేవాడికి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టిమరీ బెదిరించాడు. కారణం తెలిస్తే షాక్ తినకమానరు. హేమంత్ ఐస్‌క్రీమ్ అమ్మేవాడిన తక్కువ రేటుకు ఐస్‌క్రీమ్‌ను ఇవ్వమని అడిగాడు. దానికి అమ్మేవాడు ససెమిరా అనడంతో గన్‌తో బెదిరించాడు హేమంత్. ఈ సంఘటన చూసి అక్కడ ఉన్నవారంతా పరారయ్యారు.. చుట్టుపక్కల దాక్కున్నారు. బెదిరిపోయిన ఐస్‌క్రీమ్ అమ్మేవాడు.. ‘నీకు ఏం కావాలని తీసుకుని నన్ను వదిలేయ’మని వేడుకున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి హేమంత్‌ను, తాగిన మత్తులో ఉన్న అతని స్నేహితులను అదుపులోక తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. అది కేవలం ఎయిర్ గన్ మాత్రమే. నిజమైన తుపాకి కాదు.

హేమంత్ వాదన ఏమిటంటే.. ఐస్‌క్రీమ్‌ని రూ.5 ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని, దీనిని తగ్గించమని అడిగాను కాని అతను తగ్గించనందున ఉత్తుత్తునే బెదిరించామని చెప్పుకొచ్చాడు. కానీ.. పోలీసులు తనిపై IPC 384&506 సెక్షన్ల క్రింద FIR నమోదు చేయడం జరిగింది.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
సింగ్ ఈజ్ కింగ్
వీళ్లకు ఏమైంది..?
కాశ్మీర్ భారత్‌లో భాగమే
ప్యాకేజీ కాదు క్యాబేజీ
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
సల్మాన్ ను వదలని కేసులు
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నారా వారి అతి తెలివి
బతుకు బస్టాండ్ అంటే ఇదే
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
బస్సుల కోసం బుస్..బుస్

Comments

comments