బీసీసీఐకి సుప్రీం షాక్

SUpreme Court gave shock to BCCI

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు ఆశ్చర్యకర జడ్జిమెంట్లను వెల్లడించింది. ఒకటి రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు అడగకూడదు అని, మరొకటి బీసీసీఐ చైర్మెన్ ను తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను తొలగిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. బీసీసీఐ చైర్మెన్ తో పాటు కార్యదర్శిని కూడా తొలిగించింది. గతంలో లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే కొన్ని ఇబ్బందులున్నాయని బీసీసీఐ కార్యవర్గం చెబుతూ వస్తుంది. కాని సుప్రీం కోర్టు మాత్రం లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిందేనని తీర్పు చెప్పడంతో బీసీసీఐకి షాక్ తగిలింది.

ఎన్నోసార్లు రకరకాల ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐలో ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు జస్టిస్ లోథా కమిటీని నియమించింది. లోథా కమిటీ కొన్ని సిఫార్సులను బీసీసీఐకి సూచించింది. లోథా కమిటీ సిఫార్సుల్లో కొన్నింటికి బీసీసీఐ తన అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీసీఐ కార్యవర్గంలో పోటీ చేయాలంటే అభ్యర్థుల వయోపరిమితి, పదవుల మధ్య 3 ఏళ్ల విరామం , ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి కొన్ని అంశాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బోర్డు వ్యతిరేకిస్తోంది.

ప్రధానంగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న నిబంధనపై గుజరాత్, మహారాష్ట్రలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోథా కమిటీ సెలక్షన్ ప్యానెల్ లో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. దీనిపైనా కూడా బీసీసీఐకి అభ్యంతరాలున్నాయి భారత్ పెద్దదేశం కాబట్టి సెలక్షన్ ప్యానల్ లో ముగ్గురు సభ్యులు సరిపోరని బీసీసీఐ అంటోంది. 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసుతో సుప్రీంకోర్టు బీసీసీఐ ప్రక్షాళనకు పూనుకుంది. లోధా కమిటీని సిఫార్సులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. బీసీసీఐ పరిశీలకుడిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పిళ్లైని నియమించాలని కూడా లోథా కమిటీ సుప్రీంకోర్టును కోరింది. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ మీడియా హక్కుల కోసం చేసుకునే కాంట్రాక్టులను కూడా పిళ్లై ఆడిటర్లను నియమిస్తారని తెలిపింది. దీంతో బీసీసీఐ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండానే కాలం వెళ్లదీస్తూ వస్తోంది. దాంతో చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి బీసీసీఐ బలయ్యింది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
జగన్ అన్న.. సొంత అన్న
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
తెలంగాణకు ప్రత్యేక అండ
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
అడవిలో కలకలం
బతుకు బస్టాండ్ అంటే ఇదే
జియోకు పోటీగా ఆర్‌కాం
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
మోదీ మీద మర్డర్ కేసు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments