శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

supreme court judgement on sasikala disproportionate assets case

AIADMK general secretary VK Sasikala suffered a major jolt with the Supreme Court upholding the trial court’s judgment convicting her in the 21-year-old disproportionate assets case against her. With this, Sasikala stands disqualified to take over as Tamil Nadu chief minister.

తమిళనాడు ‘సీఎం’ పీఠంపై కూర్చోవాలని ఎన్నో కలలు కన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జయలలిత మృతి చెందిన తర్వాత నుంచి ఎన్నో ఎత్తుగడలు వేసిన ఆమె.. చివరికి రాజకీయ క్రీడలో చిత్తుగా ఓడింది. ఎలాగైనా పంథం నెగ్గాలని ప్రయత్నాలు చేస్తే.. సుప్రీంకోర్టు ఆమెకి కోలుకోలేని దెబ్బ వేసింది. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.10 కోట్లు జరిమానా విధించింది. మరో షాకింగ్ తీర్పు ఏమిటంటే.. ఈమె పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. దీంతో.. ఇన్నాళ్లుగా సీఎం పదవిపై చిన్నమ్మ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఝలక్‌కి ఖంగుతిన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు పన్నీరుకు జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇదే సమయంలో శశికళకి మరో షాక్ తగలనుందని సూచనలు కనిపిస్తున్నాయి. శశికళ, ఆమె కుటుంబ సభ్యులపై ఉన్న లీగల్‌ కేసులపై ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ ప్రత్యేక దృష్టి సారించాయి. వీరిపై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ, సీబీఐ న్యాయస్థానాలను కోరాయి. 1996-2002 మధ్యకాలంలో పలు కోర్టుల్లో శశికళ, ఆమె భర్త ఎం.నటరాజన్, వారి బంధువులు టీటీవీ దినకరన్, వీఎన్ సుధాకరన్‌లపై మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. అటు.. మైనింగ్‌ మాఫియాతోనూ శశికళ రక్తసంబంధీకులకు సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
కాటేసిందని పాముకు శిక్ష
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
బిచ్చగాళ్లు కావలెను
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
దివీస్ పై జగన్ కన్నెర్ర
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
పవన్ పంచ ప్రశ్నలు
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
మోదీ మీద మర్డర్ కేసు!
బంగారం బట్టబయలు చేస్తారా?
వంద విలువ తెలిసొచ్చిందట!
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
గుదిబండగా మారిన కోదండరాం
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments