అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం

Sushma Swaraj help for his Honeymoon trip

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. ఓ జంట తమ హనీమూన్ కు వేసుకున్న ప్లాన్ కు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చెయ్యడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముందు నుండి ఆన్ లైన్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్న సుష్మా స్వరాజ్ తాజాగా ఓ జంటకు చేస్తున్న సహాయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మంగళూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ ఫైజన్ పటేల్ కు తాను సహాయం చేస్తానని.. హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యండి అంటూ సుష్మా స్వరాజ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మంగుళూరు ఫొటోగ్రాఫర్ ఫైజన్ పటేల్ తన భార్య సనా ఫాతిమాతో కలిసి ఇటలీలో హనీమూన్ ఎంజాయ్ చేయాలనుకున్నాడు. తీరా వెళ్ళాల్సిన సమయం వచ్చే సరికి ఫాతిమా పాస్‌పోర్టు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. ఎంత వెతికినా కనిపించకపోయే సరికి, విమానం టిక్కెట్లు వృథా అవుతాయని ఫైజన్ ఒక్కడే విమానంలో ఇటలీ వెళ్ళాడు. ఈ నెల 4న విమానం ఎక్కిన వెంటనే తన పక్క సీట్లో ఫాతిమా ఫొటో పెట్టి సెల్ఫీ తీసి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు.

వెంటనే దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ స్పందించింది. పాస్ పోర్ట్ ఆఫీస్ సిబ్బంది మిమ్మల్ని కలుస్తారు.. అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు వెంటనే ఆమెకు పాస్ పోర్ట్ ఇష్యూ అయ్యేటట్లు చూడాలని సుష్మా ఆదేశాలు జారీ చేశారు. ఇంకే ముంది మనవాడికి ఆనందం ఎక్కువైంది. తన హనీమూన్ ట్రిప్ మొత్తం నాశనం అయింది అనుకున్న టైంలో సుష్మా స్వరాజ్ చేసిన సహాయం చివరకు వారికి మరిచిపోలేని జ్ఞాపకంగా మారనుంది. సో సుష్మా స్వరాజ్ నిజంగా గ్రేట్ అని అందరం అనుకోవాల్సిందే.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
వీళ్లకు ఏమైంది..?
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
నారా వారి అతి తెలివి
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
గాలిలో విమానం.. అందులో సిఎం
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
వార్దాకు వణికిపోతున్న చెన్నై
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments