కాశ్మీర్ భారత్‌లో భాగమే

Sushma Swaraj said that Kashmir always part of India

ఉరీ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ మీద ముప్పేట దాడి చేస్తోంది. ఐరాసలో ఇప్పటికే పాకిస్థాన్ ను ఎండగట్టిన భారత్.. ఈసారి పాకిస్థాన్ మీద కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ విరుచుకుపడ్డారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పునరుద్ఘాటించారు. కశ్మీర్ పై షరతులతో కాదు.. స్నేహపూర్వకంగా చర్చించాలని సూచించారు. జమ్మూలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని నవాజ్ షరీఫ్ అన్నారని… బలుచిస్తాన్ లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని నిర్మూళించడంలో విఫలమవుతున్నామన్నారు. మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై ఏకతాటిగా పోరాడాలని పలుపిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

భారత్ ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం కోసం స్వచ్చ భారత్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జన్‌ధన్ యోజనతో నిరుపేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ..ఇప్పటికే 2లక్షల స్కూళ్లలో 4లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు.

 

Related posts:
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
కాటేసిందని పాముకు శిక్ష
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
మోదీ ప్రాణానికి ముప్పు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
జయ మరణం ముందే తెలుసా?
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments