సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం

Sushma Swaraj suffering from Diabites

దేశంలో కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు సుష్మాస్వరాజ్. బిజెపి పార్టీలో సీనియర్ నేతగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది సుష్మా. లాల్ కృష్ణ అడ్వానీ దగ్గరి నుండి మోదీ వరకు అందరి దగ్గర ఆమె ఎంతో నమ్మకస్తురాలిగా పేరుగడించింది. మంత్రిగా అనేక సమస్యలను క్షణాల మీద పరిష్కరించడం సుష్మా స్పెషాలిటీ. పాస్ పోర్ట్ కోసం ఇబ్బంది పడిన చాలా మందికి ఆమె సహాయం చేశారు. పాకిస్థాన్ పెళ్లి కూతురికి ఇండియా వచ్చేందుకు వీలు కల్పిస్తూ పాస్ పోర్ట్ వచ్చేలా చేశారు. అన్నింటికి మించి పాకిస్థాన్ మీద ఐక్యరాజ్యసమితి వేదికగా సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం అందరికి నచ్చింది. పాకిస్థాన్ ను సుష్మా అంతర్జాతీయ సమాజం సాక్షిగా ఏకిపారేసింది. అలాంటి సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సీనియర్ నాయకురాలి, పార్లమెంట్ లో అధికారపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ అందరికి బాగా పరిచయస్తురాలు. అలాంటి సుష్మా స్వరాజ్ గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగోలేదని, ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. డయాబెటిస్ వల్ల తన కిడ్నీ చెడిపోయిందని, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నానని ఆమె తన ట్వీట్ లో తెలిపింది. కాగా సుష్మా గత 20 సంవత్సరాలుగా డయాబెటిస్ తో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ చేస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాగా డయాలసిస్ మీదున్న సుష్మాకు కోలుకోవడానికి మరింత టైం పడుతుందని చర్చనడుస్తోంది.

Related posts:
ఇదో విడ్డూరం
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
అతడి అంగమే ప్రాణం కాపాడింది
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఆట ఆడలేమా..?
స్టే ఎలా వచ్చిందంటే..
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ముద్రగడ సవాల్
అంత దైర్యం ఎక్కడిది..?
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మంత్రుల ఫోన్లు బంద్
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
తెలంగాణ 3300 కోట్లు పాయె
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు

Comments

comments