అమ్మను పంపించేశారా?

Tamilnadu Amma Jayalalitha died or sent

తమిళనాట అమ్మ శకం ముగిసింది. తమిళ ప్రజల చేత అమ్మగా కీర్తించబడిన జయలలిత ప్రజలందరిని ఒంటిరిగా వదిలేసి తిరిగిరాని లోకాలకు ప్రయాణమయ్యారు. అయితే జయలలిత మృతి తర్వాత రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు కోట్ల మంది ఓటు ద్వారా ఎన్నిక కాబడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంబారిన పడిన నాటి నుండి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు అమ్మ చనిపోయిందా? అమ్మను పంపించేశారా? అనే ఎన్నో శేష ప్రశ్నలను సిబిఐ ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 73 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో అతి పెద్ద నాటకం జరిగింది? అన్నది వాస్తవం కాదా?
– ప్రజల చేత ఎన్నిక కాబడిన ఓ ముఖ్యమంత్రి ఆరోగ్య సమాచారం ప్రజలకు ఎందుకు తెలియకుండా ఉంచారు?
– జయలలిత ఆరోగ్యంగా ఉన్నారు, పూర్తిగా కోలుకున్నారు  అనే వార్త బయటకు వచ్చిన తర్వాతై ఒక్కసారైనా జయ మీడియా ముందుకు వచ్చారా? అసలు ఆ వార్తలు నిజం అని ఎలా నమ్మాలి?
– జయ వార్తాపత్రికలు చదువుతున్నారు, బయట ఏం జరుగుతుందో తెలుసుకున్నారు అని తెలిసింది. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు?
– అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత  సాధారణ వ్యక్తి కాదు. మరి అపోలో ఆస్పత్రి లోపల ఏం జరిగిందో వీడియో, ఫోటోలు తీసిందా? ఒకవేళ తీస్తే వాటిని బయటకు ఎందుకు తీయడం లేదు?
– సెప్టెంబ‌ర్ 22  న జ్వరం, డీ హైడ్రేషన్ కారణంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరిన తమిళనాడు సిఎం జయలలిత డిసెంబర్ 5 న తుదిశ్వాస విడిచే వరకు అపోలో ఆస్పత్రి చాలా నాటకీయంగా వ్యవహరించింది? అని కామెంట్ ఉంది. దీనిపై క్లారిటీ కావాలి.
– సెప్టెంబర్ 22 నుండి డిసెంబర్ 5 వరకు జయలలిత ఒక్క ఫోటో, వీడియో కూడా ఎందుకు బయటకు రాలేదు.
– తమిళనాడు హైకోర్టు జోక్యం చేసుకునే వరకు అపోలో ఆస్పత్రి ఎందుకు హెల్త్ బులిటిన్ ను విడుదల చెయ్యలేదు?
– డిసెంబర్ 4వ తేదీన జయకు కార్డియక్ అరెస్ట్ అని వార్తలు వచ్చిన తర్వాత అసలు అపోలో లోపల ఏం జరిగింది?
– జయకు కార్డియక్ అరెస్ట్ రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– లండన్ నుండి ఫారెన్ డాక్టర్ వచ్చి ఏమీ చెయ్యలేని స్థితి అని చెప్పినా ఎయిమ్స్ డాక్టర్లు చేసిందేమిటి?
– డిసెంబర్ 4వ తేదీన దిల్లీలోని ఎంపీలు, కేంద్ర మంత్రి, గవర్నర్ హడావిడిగా రావడానికి కారణం ఏంటి?
– వెంకయ్య నాయుడు దిల్లీ నుండి జయ కోసం చెన్నై అపోలోకు వచ్చినా ఎవరితో మాట్లాడకుండా ఎందుకు వెళ్లిపోయారు?
– అపోలో ఆస్పత్రిని భద్రతా బలగాలను మోహరించడం, తమిళనాడు బార్డర్లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవడం ఏంటి?
– జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి వద్ద సెల్ ఫోన్ల నెట్ వర్క్స్ ను ఎందుకు ఆపేశారు?
– హుటాహుటిన అపోలోని రోగులను ఎందుకు తరలించాల్సి వచ్చింది? ఆస్పత్రి దారులు ఎందుకు మూసి వెయ్యాల్సి వచ్చింది?
– రాత్రికి రాత్రి పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా చెయ్యమని జయలలిత చెప్పిందని అంటున్నారు. అది ఎంత వరకు నిజం?
– పన్నీర్ సెల్వం హడావిడిగా ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రమాణస్వీకారం చేశారు?
– జయలలిత మరణించింది అని తమిళ వార్తాఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తే అది తప్పు అని అపోలో ఆస్పత్రి ఎందుకు ప్రకటన విడుదల చేసింది?
– లండన్ డాక్టర్ బాలే వెరీ గ్రేవీ సిస్ట్యువేషన్ అని చెప్పిన తర్వాత మళ్లీ జయ ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పడం ఏమిటి?
– ఎక్మో లైఫ్ సపోర్ట్ మెషీన్ తో జయను మరికొంత కాలం అంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే వరకు ఎందుకు ఉంచలేకపోయారు?
– పక్కాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాత్రి 11.30 నిమిషాలకు చనిపోయింది అని నాటకీయంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?

ఈ పరిణామాలు చూస్తుంటే జయను పంపించేసినట్లు అనిపిస్తుంది. దాని వల్ల ప్రజలకు అన్యాయం చేశారనే భావన కలుగుతోంది. ఈ మొత్తం నాటకీయ పరిణామాలపై ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుండి చనిపోయేంత వరకు అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Related posts:
ఇదో విడ్డూరం
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
ఓడినా విజేతనే.. భారత సింధూరం
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
పోరాటం అహంకారం మీదే
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
నారా వారి అతి తెలివి
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
బస్సుల కోసం బుస్..బుస్
మంత్రి గంటా ఆస్తుల జప్తు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments