తిరిగిరాని లోకాలకు జయ

Tamilnadu CM Jayalalitha passes away

తమిళనాట విషాదచాయలు అలుముకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, అక్కడి ప్రజలచేత అమ్మ అని పిలిపించుకున్న జయలలిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. రాత్రి 11.30గంటలకు చెన్నైలోని అపోలో ఆస్పత్రి జయలలిత ఇక లేదు అనే చేదు వార్తను వెల్లడించింది. కోట్లాది మంది తమిళులకు ఆ వార్త కంటనీరు తెప్పించింది. తీవ్ర జ్వరం డీహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి సోమవారం వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత మధ్యలో లేచి కూర్చున్నారని అన్నం తిన్నారని కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని కూడా తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని రాజాజీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. జయ వినియోగించిన కాన్వాయ్‌ తో పాటు పార్థీవదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో అధికార నివాసం పోయెస్‌ గార్డెన్‌కు తరలించారు. అనంతరం తమిళనాడు నెక్ట్స్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వం, 31 మంత్రులు, ఏఐడీఎంకే పార్టీ ముఖ్యనేతలు ఆ కాన్వాయ్‌ ని అనుసరించారు. జయ పార్థివదేహం పక్కనే ఆమె స్నేహితురాలు శశికళ నిల్చొని ఉన్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద రేపు సాయంత్రం జయలలిత అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

జయ పార్థివదేహాన్ని ప్రఖ్యాత రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు తరలించారు. ఇక్కడే ప్రముఖ నాయకులు.. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు, ప్రజలు.. రాజాజీ హాలులోనే జయ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. ఇందుకు చెన్నైలో రాజాజీ హాల్లో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

This slideshow requires JavaScript.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
సౌదీలో యువరాజుకు ఉరి
మంత్రుల ఫోన్లు బంద్
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఒక్క రూపాయికే చీర
అందుకే భూకంపం రాలేదట
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments