బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం

Tamilnadu govt moves aganist Chandrababu Naidu

Tamilnadu govt moves against Chandrababu Naidu. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

గతంలో ఎర్రచందనం దొంగల విషయంలో తమిళనాడుకు, ఏపికి మధ్యన వైరం పెరిగింది. అడవుల్లో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న తమిళనాడు దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. అప్పటికి తమిళనాడులో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా చాలా చోట్ల ఆందోళనలు చెలరేగాయి. ఇప్పుడు ఏకంగా తమిళనాడు సిఎం జయలలితనే చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న డ్యామ్ నిర్మాణం జ‌య‌లలిత ప్ర‌భుత్వం కోర్టుకెక్కింది. సుప్రీం కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. పాలార్ నది ప్రాంతంలో చెక్ డ్యాంలు, డ్యాంల ఎత్తు పెంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్న డ్యాంల ఎత్తును పెంచడం సరికాదని చెబుతోంది. అంతేకాకుండా, పాలార్ నది ఉన్న ప్రాంతంలో కొత్త డ్యాంలు నిర్మించడం అభ్యంతరకరమన్నారు. ఇది 1982 నాటి అగ్రిమెంటును ఉల్లంఘించడమే అంటున్నారు.

ఏపీ అలా ఇష్టారీతిన డ్యాంలు కడితే, ఎత్తు పెంచితే తమకు వ్యవసాయానికే కాకుండా, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతోంది. ఇష్టారీతిన డ్యాంలు కడితే తదుపరి తాగునీటికి కూడా పనికి రాకుండా ఆ నది పోతుందని చెబుతున్నారు. పాలార్ నదిలో నీటి తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో తక్కువ నీరు వచ్చిందని అంటున్నారు. కాగా, ఈ విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయినప్పటికీ డ్యాములు కట్టడం ఆగడం లేదంటున్నారు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
పిహెచ్‌డి పై అబద్ధాలు
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
దివీస్ పై జగన్ కన్నెర్ర
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?
నరేంద్రమోదీ@50 రోజులు
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments