నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)

Target Minister Narayana

తెలుగు రాష్ట్రాల్లో విమర్శలకు కేరాఫ్ గా నిలిచే ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తన విమర్శలకు పదునుపెంచారు. ఈ సారి మాత్రం ఏపి మంత్రి నారాయణను టార్గెట్ గా చేశారు ఉండవల్లి. ఈసారి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చెయ్యకుండా ఆయన లెఫ్ట్ అండ్ రైట్ గా మారిన నారాయణపై విమర్శలకు దిగారు. కాగా నారాయణ ఆస్తుల మీద మాత్రమే మాట్లాడటం విశేషం. వాణిజ్య సంస్థల ద్వారా సంపాదించగలిగే డబ్బు విద్యా సంస్థల ద్వారా ఒక వ్యక్తి ఎలా సంపాదించారు అన్నది ఉండవల్లికి అనుమానం కలిగినట్లుంది. నారాయణ 474 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలిపారని.. ఆ ఆస్తులను ఎలా సంపాదించారు అని ఉండవల్లి ప్రశ్నించారు.

మంత్రి నారాయణ చంద్రబాబు నాయుడుకు కుడి భుజం.. ఎడమ భుజంగా మారారని మరి అమరావతి స్కాంలో కూడా నారాయణ నారాయణనే బాధ్యుతవహించాల్సి వస్తుంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.  పది పదిహేను రోజుల్లోగా నారాయణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టప్రకారం ఏదైనా విషయం తెలిసి అధికారులకు చెప్పకపోవడం కూడా శిక్షార్హమే అవుతుందన్నారు.

మనం ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే ‘నారాయణ’ అంటూ ప్రారంభిస్తాం కాబట్టి, ఈ ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే మొదలుపెట్టాలని అన్నారు. ఇది ఆయనకు అశుభం కాకుండా చూసుకోవాలన్నారు. తప్పుడు మనుషులు నడిపే స్కూళ్లకు ఎవరూ పిల్లలను పంపరని, అందువల్ల ఆయన తన క్రెడిబులిటీని నిరూపించుకోవాలని చెప్పారు. ఏ వ్యాపారం చేసి ఇంత మొత్తం సంపాదించారో చెప్పాలన్నారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే అన్నీ చెప్పానని.. మీ వ్యాపారాలేంటో, వాటికి ఆధారాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనాడు అధినేత రామోజీరావు మీద కోర్టులో విజయం సాధించడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. తర్వాత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కూడా ఉండవల్లి అంతెత్తున ఎగిసిపడుతుంటారు. ఓ రకంగా నారాయణను టార్గెట్ గా చెయ్యడం ద్వారా ఉండవల్లి పరోక్షంగా టిడిపినే టార్గెట్ చేశారని స్పష్టమవుతోంది.  మొత్తానికి చంద్రబాబు నాయుడు కెబినెట్ లో ఎంతో కీలకంగా మారిన మంత్రి నారాయణకు సెగ మొదలైంది. ఉండవల్లి వైయస్ జగన్ మరో అస్త్రం సంధించినట్లు తెలుస్తోంది.

Related posts:
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
నారా వారి అతి తెలివి
ఏపీకి ఆ అర్హత లేదా?
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
వంద, యాభై నోట్లు ఉంటాయా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments