కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?

Tax on Fat in Kerala State

మాటలు ఎక్కువైతే ఎవరినైనా వాడికి కొవ్వెక్కువైందని అంటుంటాం. నిజంగా బాడీలో కొవ్వు ఎక్కువైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలా వరకు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తినమని డాక్టర్లు చెబుతుంటారు. కానీ మనం మాత్రం వినం.. పిజ్జాలు, బర్గర్లు విత్ ఎక్స్ ట్రా ఫ్యాట్అన్నట్లు తింటుంటాం. అంత తిని.. చివరకు ఆస్పత్రిలో నానా నరకయాతన పడతాం. అందుకే తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఓ పరిష్కారాన్ని కనుక్కున్నది. మంచిగా చెబితే ఎవరూ వినడం లేదు కాబట్టి బాదుడు ప్రోగ్రాం పెట్టేసింది.

కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటెంమ్స్ పై ట్యాక్స్ విధిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్ట మొదటగా పిజ్జా,బర్గర్, పాస్టా, శాండ్ విచ్ ఆహార పదార్థాలపై కేరళ సర్కారు 14.5 శాతం పన్ను విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్‌ ఇసాక్‌ తెలిపారు. అలాగే ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై 5 శాతం అదనపు పన్నును విధించారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నందున భారీ మొత్తంలో నిధుల సేకరణ అవసరం అవుతుందని ఆయన తెలిపారు. ఈ ఫ్యాట్‌ టాక్స్‌ ఇప్పటికే అనేక దేశాల్లో అమలులో వుంది. డెన్మార్క్‌, హంగరీ దేశాల్లో జంక్‌ఫుడ్‌పై భారీ పన్ను విధిస్తున్నారు.

పిజ్జా,బర్గర్, పాస్టా ఫుడ్స్ పై భారీగా ట్యాక్స్ విధించడంతో కొనుగోళ్లు కూడా తగ్గిపోయే అవకాశముంది. దీంతో కొంతమందైనా లావు తగ్గే అవకాశముందటున్నారు ప్రజలు. ప్యాక్ చేసిన గోధుమ, మైదా, రవ్వ ఉత్పత్తులపై కూడా కేరళ ప్రభుత్వం అయిదు శాతం పన్ను విధించారు… మరి వీటి వల్ల వస్తున్న అనారోగ్య సమస్య ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా కేరళ అంటేనే కొబ్బరి, కొబ్బరి ఉత్పత్తులు, కొబ్బరి నూనె… అక్కడి వంటలే కొబ్బరినూనెతో చేస్తుంటారు… చివరకు కొబ్బరి నూనెపై కూడా అయిదు శాతం పన్ను విధించారు. ఫ్యాట్ ట్యాక్స్ వెయ్యడం మంచిదే కానీ ఇలా అన్నింటి మీద ఫ్యాట్ ట్యాక్స్ పేరుతో బాదుతాం అంటే మాత్రం ఎవరు ఊరుకుంటారు చెప్పండి. కానీ మొత్తానికి దేశంలో మొదటిసారి ఫ్యాట్ ట్యాక్స్ ను కేరళ పెట్టి గొప్ప శ్రీకారం చుట్టింది.

Related posts:
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
తెలంగాణకు ప్రత్యేక అండ
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
సదావర్తి సత్రం షాకిచ్చింది
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
BSNL లాభం ఎంతో తెలుసా?
అమ్మ పరిస్థితి ఏంటి?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
నరేంద్రమోదీ@50 రోజులు
కాంగ్రెస్ నేత దారుణ హత్య
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments